Dhan Khad: బీజేపీ రాజకీయ ఒత్తిడితోనే ఉప రాష్ట్రపతి రాజీనామా:మల్లురవి

by Prasad Jukanti |

ఉప రాష్ట్రపతి రాజీనామాపై మల్లురవి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Dhan Khad: బీజేపీ రాజకీయ ఒత్తిడితోనే ఉప రాష్ట్రపతి రాజీనామా:మల్లురవి
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ రాజీనామా (Jagdeep Dhan Khad resignation) అంశం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ధన్ ఖడ్ అనూహ్య రాజీనామాపై కాంగ్రెస్ పార్టీ పలు అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో ఎంపీ మల్లు రవి (Mallurai) సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభలో తొలిరోజు సమావేశానికి అధ్యక్షత వహించిన ఉపరాష్ట్రపతి సాయంత్రానికల్లా రాజీనామా చేయడానికి బీజేపీ రాజకీయ ఒత్తిడితోనే ఉప రాష్ట్రపతి తన పదవికి రాజీనామా చేశారని ఆరోపించారు. రిజైన్ చేయడానికి చెపుతున్న అనారోగ్య కారణాలు సాకేనని అసలు కారణాలు వేరే ఉన్నాయని అనుమానాలు వ్యక్తం చేశారు. ఇవాళ ఢిల్లీలో మిడియాతో మాట్లాడిన మల్లు రవి కీలక వ్యాఖ్యలు చేశారు.

బిహార్ ఎన్నికల కోసమే ఇదంతా జరుగుతోందని.. జగదీప్ ధన్ ఖడ్ స్థానంలో మరొకరిని కూర్చోబెట్టి తద్వారా బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందాలని బీజేపీ ప్రయత్నిస్తోందనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. నిన్న రెండో సారి జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటీకి కిరణ్ రిజిజు, జేపీ నడ్డా హాజరు కాలేదని ఇక్కడే ఏదో గూడుపుఠాణి జరిగిందని ఆరోపించారు. ఆపరేషన్ సింధూర్ పై ప్రజలకు వాస్తవాలు ప్రభుత్వం చెప్పాలన్నారు. అందరూ మద్దతిచ్చినప్పుడు నిజానిజాలేంటో చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు.

Next Story