కోమటిరెడ్డికి అసలు విషయం తెలియదు.. కాంగ్రెస్ ఎంపీ షాకింగ్ కామెంట్స్

by Gantepaka Srikanth |

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy)పై కాంగ్రెస్ క్షమశిక్షణ కమిటీ చైర్మన్, ఎంపీ మల్లు రవి(Mallu Ravi) షాకింగ్ కామెంట్స్ చేశారు.

కోమటిరెడ్డికి అసలు విషయం తెలియదు.. కాంగ్రెస్ ఎంపీ షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy)పై కాంగ్రెస్ క్షమశిక్షణ కమిటీ చైర్మన్, ఎంపీ మల్లు రవి(Mallu Ravi) షాకింగ్ కామెంట్స్ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డిపై రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను అధిష్టానం చూసుకుంటుందని అన్నారు. పార్టీ విషయాలు బహిరంగంగా మాట్లాడొద్దు అని హితవు పలికారు. పదేళ్లు సీఎంగా ఉంటాననే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు సంయమనంతో ఉండాలని కోరారు. తాను పదేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉంటానని రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఏ సందర్భంలో అన్నాడో రాజగోపాల్ రెడ్డికి తెలియదని అన్నారు. సీఎంపై కేటీఆర్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారు.. దానిని కాంగ్రెస్ శ్రేణులు తిప్పికొట్టాలని సూచించారు.

కాగా, ముఖ్యమంత్రిగా మరో పదేళ్లు తానే ఉంటానని రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. రేవంత్ ప్రకటన కాంగ్రెస్ విధానాలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను కాంగ్రెస్ కార్యకర్తలు సహించరని రాజగోపాల్ రెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శించారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో అసమ్మతికి దారితీస్తున్నాయి. ఇప్పటికే కోమటిరెడ్డి వ్యాఖ్యలపై పలువురు నేతలు స్పందించి కౌంటర్ ఇవ్వగా, తాజాగా మల్లు రవి స్పందించడం హాట్ టాపిక్‌గా మారింది.

Next Story