- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దయచేసి అజ్ఞాతం వీడండి.. దేవ్‌జీ, రాజిరెడ్డికి మల్లోజుల విజ్ఞప్తి
మాజీ మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మావోయిస్టు ఉద్యమానికి మనుగడ లేదని అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: మాజీ మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మావోయిస్టు ఉద్యమానికి మనుగడ లేదని అన్నారు. ఉద్యమంలో ఉన్నవాళ్లంతా వృద్ధులైపోయారని, మావోయిస్టు పార్టీలోకి కొత్త రక్తం రావడంలేదని చెప్పారు. చైనా, రష్యా బూజు సిద్ధాంతాలపై ఉనికిని కొనసాగించలేమని అభిప్రాయపడ్డారు. తనను ద్రోహి అంటున్నారని.. అలా అంటున్నవాళ్లకు కాలమే సమాధానం చెబుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ప్రజలతోనే ఉన్నానని.. ప్రజల్లోనే ఉంటానని స్పష్టం చేశారు. ప్రజలు కోరుకుంటే రాజకీయబాట పడతానని కీలక ప్రకటన చేశారు. తన సహచరులు మంచి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. మార్చి 31లోగా మిగిలిన మావోయిస్టులు కూడా తుపాకులను వీడతారని భావిస్తున్నట్టు తెలిపారు.
ఓ తెలుగు న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మల్లోజుల ఇలా మాట్లాడారు. త్వరలోనే దేవ్ జీ, మల్ల రాజిరెడ్డిలు కూడా అజ్ఞాతం వీడాలని విజ్ఞప్తి చేశారు. దయచేసి మిగతావాళ్లు కూడా రావాలని వేడుకున్నారు. లొంగిపోయే ముందు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ముందు డిమాండ్లు పెట్టామని.. అమలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. సోనూ దాదాగా అడవి ఉద్యమాన్ని వదిలిపెట్టానని, సాధించిన విజయాలు ఏంటనేది ప్రజల మధ్యకు వెళితే తెలుస్తుందని చెప్పారు. తాను జన్మించిన తెలంగాణకు త్వరలోనే వస్తానని అన్నారు. 1980 లో ఉన్న తెలంగాణకు, ఇప్పటి తెలంగాణకు చాలా తేడా ఉందని తెలిపారు. నాటి ఉద్యామన్ని తిరిగి తీసుకురాలేకపోయామని చెప్పారు. ఆదివాలసీలను అడిగితే తాము చేసిన పనుల గురించి చెబుతారని వ్యాఖ్యానించారు. అంతే కాకుండా అర్బన్ మావోయిజం అనేది లేదని అన్నారు.






