- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Mallojula: 4 దశాబ్దాల త్వరాత స్వగ్రామానికి మల్లోజుల.. బంధువులు, స్నేహితులను చూసి పాతజ్ఞాపకాల్లోకి..
సుదీర్ఘ అజ్ఞాతం వీడి జనజీవనస్రవంతిలోకి వచ్చిన మాజీ మావోయిస్టు మల్లోజుల వేణుగోపాల్‌రావు తన స్వగ్రామానికి వచ్చారు.

దిశ, డైనమిక్ బ్యూరో: సాయుధపోరాటాన్ని వీడి జనజీవనస్రవంతిలో కలిసిన మాజీ మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్‍రావు (Mallojula Venugopal Rao) అలియాస్ సోను దాదా నాలుగు దశాబ్దాల విరామం తర్వాత స్వగ్రామంలో అడుగుపెట్టారు. ఇవాళ పెద్దపల్లిలోని (Peddapally) తన సోదరుడి ఇంటికి వెళ్లాడు. అక్కడ తన బంధువులతో ఆత్మీయులను కలుసుకున్నారు. తన స్నేహితులు, గ్రామస్తులతో ముచ్చటించారు. ఇంత కాలం దండకార్యణంలో ఉన్న మల్లోజుల గ్రామానకి రావడంతో ఆయనను చూసేందుకు ఆయన పరిచయస్తులు పెద్ద ఎత్తున అక్కడికి వచ్చారు. అక్కడ వారందరిని మల్లోజుల సరదాగా పలకరించి మాట్లాడారు. వారితో తనకున్న పాతజ్ఞాపకాలను ఈ సందర్భంగా నెమరు వేసుకున్నారు.
సోదరుడికి పరామర్శ:
పెద్దపల్లికి చెందిన మల్లోజుల వెంకటయ్య-మధురమ్మకు మూడో సంతానం వేణుగోపాల్ రావు. సోదరుడు మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్ జీ పిలుపుతో 1981లో అడవి బాటపట్టారు. అప్పటి నుంచి అజ్ఞాత జీవితం గడుపుతున్న మల్లోజుల గతేడాది అక్టోబర్‍లో తన 44 ఏళ్ల సాయుధ ఉద్యమ ప్రస్థానానికి ముగింపు పలుకుతూ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో తన సహచరులు 60 మందితో లొంగిపోయారు. ఆ తర్వాత మల్లోజుల ఒక్కసారి స్వగ్రామానికి రావాలని ఆయనతో అనుబంధం ఉన్నవారు పిలుపునిచ్చారు. కానీ ఇప్పటి వరకు ఆయన గ్రామంలో అడుగుపెట్టలేదు. అయితే తన సోదరుడు అంజన్న అనారోగ్యంతో బాధపడుతున్న సమాచారం తెలుసుకుని ఆదివారం మల్లోజుల పెద్దపల్లిలోని తన సోదరుడిని పరామర్శించేందుకు వచ్చారు. సుదీర్ఘకాలం తమకు దూరంగా ఉంటున్న మల్లోజులన చూసి ఆయన కుటుంబ సభ్యులు, పరిచయస్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఆయనతో ఫోటోలు దిగారు. అయితే 2022లో మల్లోజుల వేణుగోపాల్ తల్లి మల్లోజుల మధురమ్మ (96) మరణించారు. ఆ సమయంలో తల్లి అంత్యక్రియలకు సైతం మల్లోజుల హాజరుకాలేదు. ఆ తర్వాత అమ్మా నన్ను మన్నించు అంటూ అజ్ఞాతం నుచి భావోద్వేగ లేఖను విడుదల చేశారు. ఇప్పుడు బహిరంగ జీవితంలోకి వచ్చిన నేపథ్యంలో సుదీర్ఘ విరామం తర్వాత తన స్వగ్రామానికి వచ్చి తన పాత స్మృతులు గుర్తు చేసుకున్నారు.
పోలీసుల నిఘా:
మల్లోజుల స్వగ్రామ పర్యటన అంతా పోలీసుల కనుసన్నల్లోనే సాగుతోంది. ఆయన వెంట వచ్చిన మహారాష్ట్ర పోలీసులు మల్లోజుల కదలికలను సునిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడేందుకు మల్లోజుల నిరాకరించారు.






