నెల రోజుల్లో రేవంత్ సర్కార్ కూలుతుందన్న బీజేపీ వ్యాఖ్యలకు మల్లికార్జున ఖర్గే కౌంటర్

by Disha Web Desk 13 |
నెల రోజుల్లో రేవంత్ సర్కార్ కూలుతుందన్న బీజేపీ వ్యాఖ్యలకు మల్లికార్జున ఖర్గే కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో:నెల రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోబోతున్నదని బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ఏఐసీసీ చీఫ్ మల్లికార్జు ఖర్గే రియాక్ట్ అయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బలంగా ఉందని, ఐదేళ్ల పాటు తమ పార్టీనే అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. నిరాశలో ఉన్నవారే ప్రభుత్వం కూలిపోతుందని ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. శుక్రవారం హైదరాబాద్ లోని హోటల్ తాజ్ క్రిష్ణాలో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన ఆయన.. ఎన్నికల ప్రకటన తర్వాత అదానీ, అంబానీ గురించి రాహుల్ గాంధీ మాట్లాడటం లేదని ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలకు మల్లికార్జున ఖర్గే కౌంటర్ ఇచ్చారు. టెంపోల్లో కాంగ్రెస్ నేతలకు డబ్బులు ముడుతున్నాయని మోడీ ఆరోపిస్తున్నారు. టెంపోల్లో డబ్బులు వెళ్తుంటే మోడీ కళ్లు మసుకు కూర్చున్నారా అని ప్రశ్నించారు. అంబానీ, ఆదానీ రాహుల్ గాంధీకి డబ్బులు ఇస్తుంటే సీబీఐ, ఈడీ ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. అదానీ, అంబానీ నుంచి డబ్బులు వెళ్తుంటే వారి ఇళ్లలో సోదాలు నిర్వహించాలి. అంతే కానీ ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడటం ప్రధాని స్థాయికి తగదని హెచ్చరించారు. పబ్లిక్ సెక్టార్ ఆస్తులను ఆదానీ, అంబానీలకు కట్టబెట్టారని ధ్వజమెత్తారు. అధిక విడతల్లో ఎన్నికల నిర్వహణ ఎవరికి ఉపయోగం లేదని అయితే ఎన్నికల కమిషన్ విధానాల మేరకు అందరూ నడుచుకోవాలన్నారు.

ఓటమి భయంతోనే కుట్రలు:
కాంగ్రెస్ అంటే బీజేపీకి భయం పట్టుకుందని అందువల్లే ఓటమి భయటంతో రాజకీయాల్లోకి మతాన్ని లాగుతోందని ధ్వజమెత్తారు. అబద్దాలతో మోడీ దేశ ప్రజల దృష్టి మరిల్చే కుట్ర చేస్తు్న్నారని ధ్వజమెత్తారు. మోడీ అబద్ధాలకు సర్దార్ అని సెటైర్ వేశారు. . కాంగ్రెస్ పార్టీ ఏదైతో చెబుతుందో అది కచ్చితంగా చేసి చూపిస్తుందన్నారు. కర్ణాటకలో, తెలంగాణలో తామిచ్చిన హామీలు నెరవేర్చామన్నారు. మోడీకి 'ఎం' అనే అక్షం అంటే ఫియర్ అని.. అందువల్లే ఎంతో మొదలయ్యే మటన్, మొగల్, మగళ సూత్రంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ దేశంలో మహిళల మంగళసూత్రాలు లాక్కునే ప్రధాని ఇంకా పుట్టనేలేదన్నారు. పదేళ్లకు ఓసారి లెక్కించాల్సిన దేశ జనాభాను మోడీ గణించలేదని, జనాభా లెక్కలు తీయడం ద్వారా ప్రభుత్వాలు పేద ప్రజలకు మెరుగైన కార్యక్రమాలు అమలు చేయవచ్చన్నారు.తాము అధికారంలోకి రాగానే కులగణన చేపట్టి ఎస్సీ,ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు పెంచుతామన్నారు.

తెలంగాణలో హామీలు అమలు చేశాం:

మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో తామిచ్చిన ఆరు గ్యారెంటీలల్లో ఇప్పటి వరకు ఐదు గ్యారెంటీలను అమలు చేశామని ఎన్నికల కోడ్ కారణంగా మరో గ్యారెంటీ అమలు చేయలేకపోయామని ఖర్గే చెప్పారు. తాము చెప్పిన హామీలు తప్పక నెరవేరుస్తామన్నారు. రైతుల ఖాతాలో రైతు బంధు నిధులు జమ చేశామని పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందజేస్తామన్నారు. కాంగ్రెస్ హయాంలోనే తెలంగాణలు అనేక పరిశ్రమలు వచ్చాయని బీజేపీ హయాంలో రాష్ట్రానికి ఏం వచ్చాయని ప్రశ్నించారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed