Buddhavanam: ‘బుద్ధవనం’ ప్రత్యేక అధికారిగా మల్లేపల్లి లక్ష్మయ్య.. ప్రభుత్వ జీవో జారీ

by Ramesh Naini |   (  Updated:2025-06-30 13:39:19  IST  )

నాగార్జునసాగర్ సమీపంలోని బుద్ధవనం ప్రాజెక్టు ప్రత్యేక అధికారిగా ప్రముఖ పాత్రికేయుడు, సామాజికవేత్త మల్లేపల్లి లక్ష్మయ్య నియామకం అయ్యారు.

Buddhavanam: ‘బుద్ధవనం’ ప్రత్యేక అధికారిగా మల్లేపల్లి లక్ష్మయ్య.. ప్రభుత్వ జీవో జారీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: నాగార్జునసాగర్ సమీపంలోని (BUDDHAVANAM) బుద్ధవనం ప్రాజెక్టు ప్రత్యేక అధికారిగా ప్రముఖ పాత్రికేయుడు, సామాజికవేత్త మల్లేపల్లి లక్ష్మయ్య (Mallepally Lakshmaiah) నియామకం అయ్యారు. ఈ మేరకు సోమవారం తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. రెండు ఏళ్ల పాటు ఆయన ఈ బుద్ధవనం ప్రాజెక్టు, తెలంగాణ టూరీజం డెవలప్‌మెంట్ కార్పోరేషన్‌లో స్పెషల్ ఆఫీసర్‌గా కొనసాగనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2016 నుంచి 2024 వరకు (buddhavanam) బుద్ధవనం ప్రాజెక్ట్ స్పెషల్ ఆఫీసర్‌గా ఆయన ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు ఉన్న అవగాహనను దృష్టిలో ఉంచుకోని ప్రభుత్వం మరోసారి నియమించినట్లు తెలుస్తోంది.

అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా, మల్లేపల్లి లక్ష్మయ్య రాష్ట్ర, దేశ, విదేశీ స్థాయిలో బుద్ధిస్ట్‌ సంఘాలను సమైక్యపరుస్తూ బౌద్ధమత వ్యాప్తికి కృషి చేస్తున్నారు. కాగా, బుద్ధవనం ప్రాజెక్టు అనేది తెలంగాణలోని నాగార్జునసాగర్‌ సమీపంలోని నందికొండ హిల్‌కాలనీలో నిర్మించిన అంతర్జాతీయ బౌద్ధక్షేత్రం. ఆసియా ఖండంలోనే అతిపెద్దగా సుమారు 100 కోట్ల రూపాయలతో 247 ఎకరాల్లో నిర్మించిన ఈ బౌద్ధక్షేత్రం నాటి కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించింది. ఇటీవల మిస్‌వరల్డ్-2025 సుందరీమణులు ఈ ప్రాంతాన్ని విజిట్ చేసిన విషయం తెలిసిందే.

Next Story