ముఖ్యమంత్రి కావాలని కోరిక ఉంది.. మల్లారెడ్డి షాకింగ్ కామెంట్స్

by Kema Shiva Kumar |

రేవంత్ రెడ్డిని సీఎం చేసింది తానేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ముఖ్యమంత్రి కావాలని కోరిక ఉంది.. మల్లారెడ్డి షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి (Malla Reddy) మరోసారి తనదైన శైలిలో చేసిన వ్యాఖ్యలు చేసి రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపారు. అసెంబ్లీ వద్ద మీడియా చిట్‌చాట్‌లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తో తనకున్న సంబంధం, తన సినిమా కోరికలపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. రేవంత్ రెడ్డిని సీఎం చేసింది తాననేని అన్నారు. రెడ్డి సామాజిక వర్గంలో ఆయనంత దమ్మున్న నాయకుడు మరొకరు లేరనే విషయాన్ని తమ రెడ్డి సంఘం మీటింగ్‌లోనే చెప్పానన్నారు. అవసరమైతే ఆ వీడియో కూడా చూపిస్తానని మల్లారెడ్డి కామెంట్ చేశారు.

ఎవరు ఏమన్నా తామిద్దరం అన్నదమ్ములమని స్పష్టం చేశారు. ఇటీవల దర్శకుడు హరీష్ శంకర్ (Harish Shankar) తనను ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో విలన్ పాత్ర కోసం అడిగారని, కానీ తాను ఆ ఆఫర్‌ను తిరస్కరించానని చెప్పకొచ్చారు. తనకు వెండితెరపై ఒక్కసారైనా ముఖ్యమంత్రి పాత్ర పోషించాలని కోరికగా ఉందన్నారు. అలాంటి అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానని తన మనసులోని మాటను బయటపెట్టారు. ప్రస్తుతం మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

Next Story