- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Mallareddy: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్.. టీడీపీలోకి మల్లారెడ్డి!
మాజీ మంత్రి మల్లారెడ్డి తిరుమల టూర్ తెలంగాణ రాజాకీయాల్లో ఇంట్రెస్టింగ్ గా మారాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (Mallareddy) పరిచయం అక్కర్లేని పేరు. ఏదో ఇష్యూలో నిత్యం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టే మల్లారెడ్డి రాజకీయ భవిష్యత్ పై రకరకాల ఊహాగానాలు పెరుగుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన ఆయన తన మాటతీరు, అదిరిపోయే డైలాగులతో అందరికీ సుపరిచితమే. అయితే ఇటీవల ఆయన బీఆర్ఎస్ ను వీడి పక్క చూపులు చూస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటువంటి తరుణంలో తాజాగా మల్లారెడ్డి తిరుమల టూర్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తన పుట్టిన రోజు నేపథ్యంలో ఇవాళ మల్లారెడ్డి తిరుమలకు వచ్చారు. ఈ సందర్భంగా తిరుపతిలో కూటమి నేతలు మల్లారెడ్డికి స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు కట్టడం రాజకీయ చర్చకు దారి తీసింది.
టీటీడీపీ పగ్గాలు మల్లారెడ్డికి?:
తిరుపతిలో మల్లారెడ్డికి స్వాగతం పలుకుతూ కూటమి నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఫోటోలు సైతం ఉన్నాయి. ఈ ఫ్లెక్సీలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మల్లారెడ్డి త్వరలోనే బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి టీటీడీపీ (TDP) పగ్గాలు చేపట్టడం ఖాయం అని జోరుగా ప్రచారం జరుగుతోంది.
చంద్రబాబుపై ప్రశంసలు:
ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మల్లారెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై (Chandrababu) ప్రశంసల జల్లు కురిపించారు. ఏపీని సీఎం చంద్రబాబు చాలా బాగా అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఏపీకి రూ.లక్షల కోట్లు కేటాయిస్తున్నారని చెప్పారు. గతంలో ఏపీలో భూములు విక్రియించి తెలంగాణలో కొనుగోలు చేస్తే చంద్రబాబు వచ్చాక అంతా రివర్స్ అయిందన్నారు. తెలంగాణలో భూముల రేట్లు పడిపోయాయన్నారు. అయితే మల్లారెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీస్తోంది. చంద్రబాబు పేరు చెబితేనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చిటపటలాడిపోతారని అటువంటిది బీఆర్ఎస్ ఎమ్మెల్యే చంద్రబాబును ప్రశంసించడం వెనుక గులాబీ పార్టీకి షాక్ తప్పదా అనే చర్చ సామాజిక మాధ్యమాల్లో వినిపిస్తోంది.
అన్ని పార్టీలను కవర్ చేస్తున్న మల్లారెడ్డి:
మల్లారెడ్డి తీరుతో ఆయన పార్టీ మార్పుపై రకరకాల వాదనలు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలో ఇటీవల ఆయన అన్ని పార్టీల నేతలను కలుస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. గతేడాది మల్లారెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఆ సమయంలో తన మనవరాలి పెళ్లికి ఆహ్వానించేందుకే చంద్రబాబును కలిశానని చెప్పారు. అదే సమయంలో కిషన్ రెడ్డిని కలిశారు. ఆ తర్వాత బెంగళూరులో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను కలవడం సంచలనం అయింది. ఇక ఇటీవల బోనాల సందర్భంలో మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి కేంద్ర మంత్రి బండి సంజయ్ తో భేటీ అయ్యారు. దీంతో మల్లారెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఇతర పార్టీ నేతలను కవడం వెనుక ఏదైనా రాజకీయ వ్యూహమా? అనే ప్రశ్నలు రాష్ట్ర రాజకీయాల్లో వినిపిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా మల్లారెడ్డి తిరుపతి టూర్ (Mallareddy Tirumala Tour) ఉత్కంఠగా మారింది. అసలే రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ రోజు రోజుకు వీక్ అవుతున్న పరిస్థితుల్లో జరుగుతున్న ప్రచారం మేరకు మల్లారెడ్డి కండువా మార్చడం ఖాయమేనా అనేది కాలమే సమాధానం చెప్పనుంది.






