- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ లో సమ్మె తాత్కాలిక వాయిదా
మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్‌లో నిన్నటి నుండి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.

దిశ తెలంగాణ బ్యూరో : మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్‌లో నిన్నటి నుండి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. పూర్తిస్థాయిలో సమ్మెకు దిగుతామని ఇంటర్న్ డ్యూటీ డాక్టర్లు, పీజీలు కఠినమైన నిర్ణయం తీసుకోవడంతో యజమాన్యం కాస్త వెనక్కి తగ్గింది. ఈరోజు సమ్మె ప్రారంభానికి ముందు, మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్ డాక్టర్ సిహెచ్. భద్రా రెడ్డి ఇంటర్న్‌లతో సమావేశమయ్యారు. యాజమాన్యం ఇప్పటికే నెలకు ₹4,000 చెల్లించడానికి కట్టుబడి ఉందని వారికి తెలియజేశారు. ఈ విషయాన్ని నేషనల్ మెడికల్ కమిషన్ కి సైతం తెలియజేసినట్లు ఆయన తెలిపారు.
అయితే, ప్రభుత్వ ఇంటర్న్‌లతో సమానంగా స్టైఫండ్ డిమాండ్ చేస్తూ ఇంటర్న్‌లు పట్టుదలతో ఉండడంతో ఇదే విషయాన్ని అన్ని ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలతో బాటు చర్చించి త్వరలో ఒక నిర్ణయానికి వస్తామని డాక్టర్ భద్రారెడ్డి పేర్కొన్నారు. దీని కోసం ఒక వారం సమయం కావాలని ఆయన అభ్యర్థించారు. ఫలితంగా, ఇంటర్న్‌లు తమ సమ్మె పిలుపును తాత్కాలికంగా నిలిపివేశారు. హామీ ఇచ్చిన సమయంలోపు యజమాన్యం వైపు నుండి స్పందన రాకపోతే, సమ్మెను తిరిగి ప్రారంభించడానికి కట్టుబడి ఉన్నామనీ... ఈ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు.






