‘మల్లారెడ్డి కోడలా మజాకా’.. ఆయన్ను మించిన ఎనర్జీతో స్టెప్పులు

by Gantepaka Srikanth |

మాజీ మంత్రి మల్లారెడ్డి(Mallareddy) ఎనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనదైన శైలిలో పబ్లిక్‌లో స్టెప్పులెస్తూ ఆయన అభిమానుల్ని ఉత్సహ పరుస్తుంటారు.

‘మల్లారెడ్డి కోడలా మజాకా’.. ఆయన్ను మించిన ఎనర్జీతో స్టెప్పులు
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి మల్లారెడ్డి(Mallareddy) ఎనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనదైన శైలిలో పబ్లిక్‌లో స్టెప్పులెస్తూ ఆయన అభిమానుల్ని ఉత్సహ పరుస్తుంటారు. తాజాగా మల్లారెడ్డి కొడలు కూడా హైపర్ యాక్టీవ్ అని నిరూపించింది. విద్యా్ర్థులతో కలిసి స్టెప్పులేసి అందరిలోనూ జోష్ నించింపి. క్యాన్సర్‌(Cancer)పై అవగాహన కోసం హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో భారీ మారథాన్ జరిగింది. గ్లోబల్ ఓరల్ క్యాన్సర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టీ-వర్క్స్‌ నుంచి మైహోమ్ భూజ మీదుగా ఐటీసీ వరకు ఆదివారం ఉదయం 5K, 10K, 2.5K రన్స్‌ కొనసాగాయి. గ్లోబల్‌ ఓరల్ క్యాన్సర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మైహోం గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు, ప్రముఖ వైద్యులతో పాటు యువత కూడా పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా యువతీ, యువకులతో కలిసి మల్లారెడ్డి కొడలు డాక్టర్ ప్రీతిరెడ్డి(Dr. Preethi Reddy) డాన్స్ చేశారు.

Next Story