కేసీఆర్ సీఎం కాబోతున్నారు... మల్లారెడ్డి షాకింగ్ కామెంట్స్ !

by velandi.Saikiran |

తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పై ( Kalvakuntla Chandrasekhara Rao)... మాజీ మంత్రి మల్లారె

కేసీఆర్ సీఎం కాబోతున్నారు... మల్లారెడ్డి షాకింగ్ కామెంట్స్ !
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పై ( Kalvakuntla Chandrasekhara Rao)... మాజీ మంత్రి మల్లారెడ్డి ( MALLA REDDY) హాట్ కామెంట్స్ చేశారు. అతి త్వరలోనే కేసీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నాడని... ఎవరు భయపడకూడదని కోరారు. తెలంగాణ భవన్ లో ( Telangana Bhavan) రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేడుకలు చాలా గ్రాండ్ గా నిర్వహించారు.

ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు తెలంగాణ గులాబీ పార్టీ నేతలు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు ( Harish Rao), సబితా ఇంద్రారెడ్డి తో పాటు మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మల్లారెడ్డి అదిరిపోయే స్పీచ్ ఇచ్చారు. తన స్టైల్ లో కేసీఆర్ గురించి... మాట్లాడి గులాబీ నేతల్లో కొత్త జోష్ నింపారు. మూడు సంవత్సరాల ఆగండి మళ్లీ మన కేసీఆర్ వస్తాడు... ఎందుకంటే వాళ్ళ గొయ్యి వాళ్లే తవ్వుకుంటున్నారు... అంటూ కాంగ్రెస్ పార్టీకి చురకలు అంటించారు మల్లారెడ్డి.

అప్పటి వరకు గులాబీ పార్టీ నేతలు ఓపిక పట్టాలని రిక్వెస్ట్ చేశారు. మూడు సంవత్సరాల లోపు కేసులు, జైలు పాలు కావడం జరుగుతాయని.. వాటికి భయపడకుండా నిలబడ్డ వాడే నాయకుడు అంటూ వ్యాఖ్యానించారు. దీంతో మాజీ మంత్రి మల్లారెడ్డి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. అటు హరీష్ రావు కూడా గులాబీ పార్టీ ఏ పార్టీతో కూడా పొత్తు పెట్టుకోబోదని... సొంతంగానే 100 సీట్లు గెలుస్తామని ప్రకటించారు.

Next Story