4 దశాబ్దాల తర్వాత స్వగ్రామంలో మాజీ మావోయిస్టు మల్లా రాజిరెడ్డి.. రాజకీయ పార్టీపై క్లారిటీ

by Prasad Jukanti |   (  Updated:2026-04-04 13:01:41  IST  )

4 దశాబ్దాల తర్వాత స్వగ్రామంలో మాజీ మావోయిస్టు మల్లా రాజిరెడ్డి.. రాజకీయ పార్టీపై క్లారిటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇటీవల పోలీసుల ఎదుట లొంగిపోయిన మాజీ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు మల్లా రాజిరెడ్డి (Malla Raji Reddy) స్వగ్రామంలో సందడి చేశారు. సుమారు నాలుగు దశాబ్దాల క్రితం స్వగ్రామాన్ని వీడి అజ్ఞాతం బాట పట్టిన ఆయన తాజాగా సొంతూరు మంథనికి వచ్చారు. అక్కడ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులను కలుసుకుని వారితో సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దాదాపు 46 ఏళ్ల క్రితం తాను తన స్వాగ్రామాన్ని వీడానని 1999 జనవరిలో ఓ సారి రాత్రిపూట తన స్వగ్రామానికి వచ్చి వెళ్లాను తప్ప గ్రామాభివృద్ధి ఎలా ఉందో ఇన్నాళ్లు చూడలేదన్నారు. తమకు రాజకీయ పార్టీ పెట్టే ఉద్దేశం లేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇస్తే సామాజిక సేవ చేస్తామన్నారు.

Next Story