హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహనరావుకు రిమాండ్

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-07-10 14:31:14  IST  )

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అధ్యక్షుడు జగన్ మోహన్‌రావుకు మల్కాజ్‌గిరి కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ (Judicial Remand) విధించింది.

హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహనరావుకు రిమాండ్
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అధ్యక్షుడు జగన్ మోహన్‌రావుకు మల్కాజ్‌గిరి కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ (Judicial Remand) విధించింది. హెచ్‌సీఏ (HCA) అధ్యక్ష ఎన్నికల అక్రమాల కేసులో నిందితుడిగా ఉన్న ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించింది. శ్రీచక్ర క్రికెట్ క్లబ్ (Sri Chakra Cricket Club) పేరుతో జగన్మోహనరావు నకిలీ పత్రాలు సృష్టించినట్లు సీఐడీ ఆరోపణలు చేస్తోంది. గౌలిపురా క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కృష్ణయాదవ్ సంతకాన్ని క్లబ్ ప్రెసిడెంట్ కవిత ఫోర్జరీ చేసి వాటిని జగన్మోహన్ కు అప్పగించారు. వాటిని ఉపయోగించి జగన్మోహన్ రావు హెచ్‌సీఏ అధ్యక్షుడు అయినట్లుగా సీఐడీ వాదిస్తోంది.

కాగా.. హెచ్‌సీఏ, ఎస్ఆర్ హెచ్ వివాదంలో ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు సీఐడీ ప్రకటించింది. హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు, హెచ్‌సీఏ ట్రెజరర్ శ్రీనివాసరావు, శ్రీచక్ర క్లబ్ జనరల్ సెక్రటరీ రాజేంద్ర యాదవ్, హెచ్‌సీఏ సీఈఓ సునీల్ కాంటే, శ్రీ చక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలు జి.కవితలను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. నిధులు దుర్వినియోగం అయ్యాయని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ధరమ్ గురువారెడ్డి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన సీఐడీ వారందరినీ అరెస్ట్ చేసింది. ఈ క్రమంలోనే జగన్మోహనరావు నకిలీ పత్రాలతో హెచ్‌సీఏ రేసులో పోటీ చేసినట్లుగా గుర్తించింది.

Next Story