- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘మీరు లేకుంటే మా జీవితం లేదు’.. కేటీఆర్‌ను చూసి బాధితుల భావోద్వేగం
బతుకుదెరువు కోసం మలేసియా(Malaysia)కు వెళ్లి.. అక్కడ వివాదంలో చిక్కుకొని జైలు పాలైన తెలంగాణ వాసులు.. తిరిగి సేఫ్‌గా దేశానికి వచ్చారు.

దిశ, వెబ్‌డెస్క్: బతుకుదెరువు కోసం మలేసియా(Malaysia)కు వెళ్లి.. అక్కడ వివాదంలో చిక్కుకొని జైలు పాలైన తెలంగాణ వాసులు.. తిరిగి సేఫ్‌గా దేశానికి వచ్చారు. బుధవారం స్వదేశానికి చేరుకున్నారు. వీరికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) హెల్ప్ చేశారు. రాష్ట్రంలోని ఖానాపూర్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నేత భూక్యా జాన్సన్ నాయక్ చొరవతో మలేసియా దేశ అధికారులతో కేటీఆర్ మాట్లాడి స్వదేశానికి రప్పించారు. దీనికి ముందు జాన్సన్ నాయక్ స్వయంగా మలేసియాకు వెళ్లి జైల్లో తమ ప్రాంత వాసులను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత అధికారులతో కేటీఆర్ ఫోన్‌లో మాట్లాడారు. ఎట్టకేలకు ఇవాళ వారంతా ఇండియాకు చేరుకున్నారు. వచ్చి రాగానే హైదరాబాద్ సమీపంలోని నందినగర్ నివాసలో కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు. మీరు లేకుంటే మా జీవితం లేదు అంటూ కంటతడి పెట్టారు. ఆపదలో తమను అన్ని విధాలా ఆదుకున్న కేటీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటామమని చెప్పారు.






