Malaysia: రాష్ట్ర అభివృద్ధికి సహకరించండి.. మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు​

by Ramesh Goud |

రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) కోరారు.

Malaysia: రాష్ట్ర అభివృద్ధికి సహకరించండి.. మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు​
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) కోరారు. శనివారం ఆయన మలేషియా తెలంగాణ అసోసియేషన్ దశాబ్ది ఉత్సవాలు(Malaysian Telangana Association's decade celebrations) లో పీసీసీ చీఫ్​ మహేష్​ కుమమార్ గౌడ్(PCC chief Mahesh Kumar Goud) తో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ..ప్రజాప్రభుత్వంలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధికి చొరవ తీసుకుంటున్నామన్నారు. మలేనియా తెలంగాణ అసోసియేషన్ కూడా సహకరించాలని కోరారు. పీసీసీ చీఫ్​మహేష్​ కుమార్ గౌడ్ మాట్లాడుతూ..పదేళ్లు పూర్తి చేసుకున్న మలేషియన్ తెలంగాణ అసోసియేషన్ కు తెలంగాణ ప్రభుత్వం తరుపున శుభాకాంక్షలు తెలిపారు. పార్టీలకు అతీతంగా ఇక్కడికి వచ్చామని, రాష్ట్ర డెవలప్ మెంట్ లో ఎన్ ఆర్ ఐలు భాగస్వామ్యం అవ్వాలన్నారు. ప్రపంచ దేశాల్లో తెలంగాణ ప్రజలు ఎక్కడున్నా, కష్టసుఖాల్లో పాలు పంచుకుంటామన్నారు. తెలంగాణ ప్రజలు భవిష్యత్ లో అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలని కోరుకున్నారు.

Next Story