- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రూ.383 కోట్ల నిధులు ఇవ్వండి.. మంత్రి కోమటిరెడ్డికి మల్ రెడ్డి విజ్ఞప్తి
పలు రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డిని కోరారు.

దిశ, తెలంగాణ బ్యూరో: పలు రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డిని కోరారు. మంగళవారం భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి రాష్ట్ర సచివాలయంలో మంత్రిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఇబ్రహీంపట్నం, ఎల్బీనగర్ నియోజకవర్గాల్లో ఆర్ అండ్ బీ పరిధిలోని పలు రోడ్లు అభివృద్ధి చేయాలని వారు కోరారు. పెరిగిన ట్రాఫిక్ ను దృష్టిలో పెట్టుకొని సింగిల్ రోడ్ నుండి డబుల్ రోడ్, డబుల్ రోడ్ నుంచి ఫోర్ లేన్ రోడ్లుగా విస్తరణ చేపట్టాలని వీటి కోసం సుమారు రూ.383 కోట్ల మంజూరు చేయాలని కోరారు. రోడ్డ పనులకు సంబంధించిన ప్రపోజల్స్ మంత్రికి అందజేశారు. ట్రాఫిక్ దృష్ట్యా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రోడ్ల విస్తరణకు సంబంధించి గతంలో హామీ ఇచ్చానని మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి సంబంధిత పనులకు నిధులు మంజూరు చేయించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు.






