- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘రాజీనామా చేయడానికి రెడీ’.. మంత్రి పదవిపై మల్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
మంత్రి పదవిపై ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి పదవి(Minister Post)పై ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి(Malreddy Ranga Reddy) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వడానికి కులమే అడ్డయితే రాజీనామా చేయడానికి కూడా వెనుకాడను అని అన్నారు. మరో సామాజికవర్గానికి టికెట్ ఇచ్చినా గెలిపిస్తానని అధిష్టానానికి హామీ ఇచ్చారు. గెలిచిన తర్వాత తప్పకుండా రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే అని అన్నారు. రంగారెడ్డి జిల్లాను ఎంతో అభివృద్ధి చేశానని చెప్పారు. ఈ ప్రాంత ప్రజల కోసం ఏం చేయడానికైనా సిద్ధమే అని ప్రకటించారు.
ఇదిలా ఉంటే.. మంత్రివర్గ విస్తరణలో స్థానం దక్కించుకునేందుకు కాంగ్రెస్‌లోని పలువురు నేతలు పోటీ పడుతున్నారు. అయితే, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మంత్రి వర్గంలో ప్రాతినిధ్యం లేకపోవటంతో ఆ జిల్లాకు చెందిన నేతలకు త్వరలోనే జరగబోయే మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పిస్తారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో మల్‌రెడ్డి రంగారెడ్డి లేదంటే.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలలో ఒకరికి మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉందన్న ప్రచారమూ జరిగింది. అయితే, అనూహ్యంగా ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి పరిగి వేదికగా చేసిన వ్యాఖ్యలతో మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత రంజిత్ రెడ్డికి మంత్రి వర్గంలో చోటు ఖాయమైనట్లు స్పష్టమవుతోంది. దీంతో మల్‌రెడ్డి రంగారెడ్డి అప్రమత్తమై అధిష్టానికి కీలక సందేశం ఇచ్చారు.






