సింగరేణి కార్మికుల సొంతింటి కలను సాకారం చేయండి.. మంత్రి పొంగులేటికి వినతి

by Kema Shiva Kumar |

సింగరేణి సంస్థలో పనిచేస్తున్న కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సొంత ఇంటి కల నెరవేర్చాలని రాష్ట్ర రెవిన్యూ హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి‌ని తెలంగాణ కనీస వేతనాల సలహా మండలి చైర్మన్, ఐఎన్‌టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ఆధ్వర్యంలో కార్మికులు విజ్ఞప్తి చేశారు.

సింగరేణి కార్మికుల సొంతింటి కలను సాకారం చేయండి.. మంత్రి పొంగులేటికి వినతి
X

దిశ, తెలంగాణ బ్యూరో: సింగరేణి సంస్థలో పనిచేస్తున్న కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సొంత ఇంటి కల నెరవేర్చాలని రాష్ట్ర రెవిన్యూ హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి‌ని తెలంగాణ కనీస వేతనాల సలహా మండలి చైర్మన్, ఐఎన్‌టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ఆధ్వర్యంలో కార్మికులు విజ్ఞప్తి చేశారు. ఇదే విషయాన్ని సింగరేణి సీఎండీ ఎం.బలరామ్, డైరెక్టర్ పాలను కలిసి విజ్ఞప్తి చేశామన్నారు. ముఖ్యంగా అనేక పెండింగ్ సమస్యలు, హామీలు వెంటనే అమలు చేయాలని కార్మికులు కోరుతున్నారని, ముఖ్యంగా కార్మికుల సొంత ఇంటి కల తో పాటు కార్మికుల పీఈఆర్‌కేఎస్​(PERKS) మీద ఐటీ బిల్లు‌లను మాఫీ చేయాలన్నారు. అంతే కాకుండా పలువురు డిస్మిస్ అయిన కార్మికుల సమస్యలు, కార్మికుల మారుపేర్ల మార్పు‌తో పాటు కొత్తగూడెంలో ఈ నెలాఖరున శంకుస్థాపన చేసే కొత్త బొగ్గు గనుల అంశం, కార్మికులకు సీపీఆర్ఎం ఎస్ఈ కార్డు నుంచి రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాలని సీఎండీని కోరామన్నారు. ఇందుకు ప్రభుత్వ రెవెన్యూ పరంగా మీరు సహకరించాలని మంత్రి పొంగులేటిని కలిసి విజ్ఞప్తి చేశామని జనక్​ప్రదాస్ తెలిపారు. ఈ సమావేశంలో సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు నరసింహ రెడ్డి, ధర్మపురి, సమ్మయ్య, త్యాగరాజన్, జనరల్ సెక్రటరీ వికాస్ కుమార్ యాదవ్, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ దాస్, రీజినల్ జనరల్ సెక్రటరీ ఆల్బర్ట్, సీనియర్ నాయకులు శంకర్​రావు, పానుగంటి వెంకట‌స్వామి, తదితరులు పాల్గొన్నారు.

Next Story