- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. నేడు ‘సిట్’ ముందుకు సీఎం రేవంత్ అనుచరుడు
తెలంగాణను కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: స్టేట్ పాలిటిక్స్‌లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో మరో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరుడు, కాంగ్రెస్ నేత శ్రీరాం రెడ్డికి ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఆయన బషీర్‌బాగ్‌లోని పాత పోలీస్ కమిషనర్ (CP) కార్యాలయంలో సిట్ అధికారుల ముందు విచారణకు హాజరుకానున్నారు.
టార్గెట్ రేవంత్ రెడ్డి.. శ్రీరాం రెడ్డి ఫోన్ ట్యాప్?
అయితే, శ్రీరాం రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలోని దౌల్తాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఆయన సీఎంతో పాటు ఆయన సోదరుడు తిరుపతి రెడ్డికి అత్యంత నమ్మకస్తుడైన అనుచరుడిగా కొనసాగుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రేవంత్ రెడ్డి, తిరుపతి రెడ్డిల వ్యక్తిగత వివరాలు, రాజకీయ వ్యూహాలు, ఆర్థిక లావాదేవీల సమాచారాన్ని సేకరించేందుకు నాటి ఇంటెలిజెన్స్ అధికారులు శ్రీరాం రెడ్డి ఫోన్‌ను ట్యాప్ చేసినట్లు ‘సిట్’ ప్రాథమికంగా అనుమానిస్తోంది. ఈ సందర్భంగా శ్రీరాం రెడ్డి ఫోన్‌ను ఏ కాలంలో ట్యాప్ చేశారు? ఎవరెవరితో మాట్లాడిన డేటాను రికార్డ్ చేశారు? అనే కోణంలో సిట్ అధికారులు ఆయనను ప్రశ్నించనున్నారు. విచారణలో భాగంగా శ్రీరాం రెడ్డి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయడంతో పాటు, ఆయనకు సంబంధించిన కొన్ని సాంకేతిక ఆధారాలను కూడా సిట్ పరిశీలించనున్నట్లుగా సమాచారం.






