తెలంగాణ అటవీశాఖలో భారీ బదిలీలు: 10 మంది ఐఎఫ్ఎస్ అధికారులకు స్థానచలనం

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-29 16:39:40  IST  )

తెలంగాణ అటవీశాఖలో 10 మంది ఐఎఫ్ఎస్ (IFS) అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణ అటవీశాఖలో భారీ బదిలీలు: 10 మంది ఐఎఫ్ఎస్ అధికారులకు స్థానచలనం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర అటవీశాఖలో ప్రభుత్వం భారీగా బదిలీలు చేపట్టింది. 10 మంది ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ (IFS) అధికారులతో పాటు మరో ఇద్దరు నాన్-క్యాడర్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 11 మంది అధికారులకు కొత్త పోస్టింగ్‌లు కేటాయించారు. వికారాబాద్ డీఎఫ్ఓగా పనిచేసిన జి.జ్ఞానేశ్వర్‌ను పీసీసీఎఫ్ (PCCF) ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా అటవీ సంరక్షణ చర్యలను మరింత వేగవంతం చేసేందుకు, పాలనా సౌలభ్యం కోసం ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. బదిలీ అయిన అధికారులు తక్షణమే తమ కొత్త బాధ్యతల్లో చేరాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Next Story