- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Fire accident: అంబర్‌పేట ఫ్లైఓవర్ వద్ద భారీ అగ్నిప్రమాదం.. వాహనదారుల ఇక్కట్లు!
by Ramesh Naini |
హైదరాబాద్‌లో కొత్తగా ప్రారంభించిన అంబర్‌పేట ఫ్లై ఓవర్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లో కొత్తగా ప్రారంభించిన అంబర్‌పేట ఫ్లై ఓవర్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అంబర్ పేట్ పీఎస్ పరిధిలోని చే నంబర్ చౌరస్తా వద్ద ఫ్లైఓవర్ కింద నిర్మాణ సామగ్రి ఉన్న షెడ్లలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.. మంటలు ఎగిసిపడడంతో దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీంతో వాహనదారులు, స్థానికులు దట్టమైన పొగతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని మంటలార్పే ప్రయత్నం చేశారు. దట్టమైన పొగతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కాగా, అంబర్‌పేట నూతన ఫ్లైఓవర్‌పై నుంచి రాకపోకలు ఫిబ్రవరి 26న ప్రారంభమైన విషయం తెలిసిందే.
Next Story






