HYD: నిమ్స్‌ ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం

by Gantepaka Srikanth |   (  Updated:2025-04-19 11:25:46  IST  )

హైదరాబాద్(Hyderabad) నిమ్స్ ఆసుపత్రి(NIMS Hospital)లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.

HYD: నిమ్స్‌ ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్(Hyderabad) నిమ్స్ ఆసుపత్రి(NIMS Hospital)లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఎమర్జెన్సీ విభాగం(Emergency Department)లో శనివారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో పొగ దట్టంగా అలుముకోవడంతో రోగులు, సిబ్బంది బయటకు పరుగులు తీశారు. ఆసుపత్రిలోని ఐదో అంతస్తుల్లో మంటలు ఎగిసిపడుతున్నట్లు సమాచారం. గమనించిన వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. అగ్ని ప్రమాదానికి సంబంధించిన విషయాలపై ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story