- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్రామాల అభివృద్ధికి కేంద్రం బిగ్ బూస్ట్.. రూ.4.35 లక్షల కోట్ల గ్రాంట్‌కు గ్రీన్ సిగ్నల్!
దేశంలోని గ్రామ పంచాయతీలకు మహర్దశ పట్టనుంది. గ్రామీణ సంస్థల బలోపేతానికి 16వ ఆర్థిక సంఘం రూ.కోట్ల భారీ గ్రాంట్‌ను సిఫార్సు చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: గ్రామీణ ప్రాంతాల రూపురేఖలను మార్చేందుకు, స్థానిక సంస్థలను బలోపేతం చేసేందుకు 16వ ఆర్థిక సంఘం (16th Finance Commission) చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. రాబోయే ఐదేళ్ల కాలానికి గాను ఏకంగా రూ.4,35,236 కోట్ల భారీ గ్రాంట్‌ను సిఫార్సు చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ (Union Ministry of Finance) అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ భారీ నిధుల కేటాయింపుల్లో రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్రం అత్యధిక ప్రధాన్యతను ఇచ్చింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు రూ.16,627 కోట్లు, అలాగే తెలంగాణకు రూ.9,968 కోట్ల నిధులను కేటాయించారు.
అయితే, తాజాగా విడుదల చేయబోయే నిధులు గ్రామీణ సంస్థల ఆధునీకరణకు ఉపయోగించాల్సి ఉంటుంది. పల్లెల్లో మౌలిక సదుపాయాల కల్పన, తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ, గ్రామీణ ప్రాంతాల కనెక్టివిటీ, అంతర్గత రోడ్ల అభివృద్ధి గ్రామీణ వైద్యం, విద్య, ఉపాధి కల్పన వంటి కీలక రంగాల్లో అభివృద్ధి పనుల కోసం ఈ నిధులను ఖర్చు చేయనున్నారు. 16 ఆర్థిక సంఘం నిధులతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని స్థానిక సంస్థలకు భారీ ఆర్థిక ఊరట లభించనుంది.






