హైదరాబాద్‌ దుర్గామాత విగ్రహాల నిమజ్జనంలో తప్పిన పెను ప్రమాదం

by Ajay Maddhiboyina |

హైదరాబాద్ సరూర్‌నగర్ చెరువు వద్ద దుర్గామాత విగ్రహాల నిమజ్జనంలో పెను ప్రమాదం తప్పింది. విగ్రహం నిమజ్జనం చేస్తుండగా క్రేన్ పల్టీ కొట్టింది. అది చెరువులో పడటంతో పెను ప్రమాదం తప్పింది.

హైదరాబాద్‌ దుర్గామాత విగ్రహాల నిమజ్జనంలో తప్పిన పెను ప్రమాదం
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ సరూర్‌నగర్ చెరువు వద్ద దుర్గామాత విగ్రహాల నిమజ్జనంలో పెను ప్రమాదం తప్పింది. విగ్రహం నిమజ్జనం చేస్తుండగా క్రేన్ పల్టీ కొట్టింది. అది చెరువులో పడటంతో పెను ప్రమాదం తప్పింది. రోడ్డువైపు పడి ఉంటే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. చెరువులో పడటం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఇక సరైన అనుభవం లేని సిటీ క్రేన్ సర్వీసెస్ కు కాంట్రాక్ట్ ఇవ్వడం వల్లనే ప్రమాదం జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. ట్యాంక్ బండ్ పై కూడా ఇదే కంపెనీకి కాంట్రాక్ట్ అప్పగించారని, ఒకే కంపెనీకి పలు చోట్ల కాంట్రాక్టులు ఇచ్చారని విమర్శలు వస్తున్నాయి. VIDEO

Next Story