Majaka: హీరోయిన్ పై అనుచిత వ్యాఖ్యలు.. సంచలన వీడియో విడుదల చేసిన డైరెక్టర్

by Ramesh Goud |   (  Updated:2025-01-13 12:56:20  IST  )

హీరోయిన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన డైరెక్టర్ త్రినాథరావు నక్కిన(Director Thrinatha Rao Nakkina) ఘటనపై వివరణ ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Majaka: హీరోయిన్ పై అనుచిత వ్యాఖ్యలు.. సంచలన వీడియో విడుదల చేసిన డైరెక్టర్
X

దిశ, వెబ్ డెస్క్: హీరోయిన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన డైరెక్టర్ త్రినాథరావు నక్కిన(Director Thrinatha Rao Nakkina) ఘటనపై వివరణ ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదివారం మజాకా(Majaka) టీజర్ లాంచ్ ఈవెంట్(Teser Launch Event) లో తాను మాట్లాడిన మాటలు అందరి మహిళల మనసును నొప్పించిందని అర్థం అయ్యిందని అన్నారు. ఈ వ్యాఖ్యలు తాను అక్కడ ఉన్న వారిని నవ్వించే ప్రయత్నంలో అనుకోకుండా వచ్చిన మాటలే తప్ప.. కావాలని చేసినది కాదని చెప్పారు.

మా ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారని, అయినా మీ అందరీ మనసు నొప్పించాను కాబట్టి తప్పు తప్పే అని, మహిళలందరూ నన్ను క్షమించాలి(Sorry) అని కోరారు. అలాగే హీరోయిన్ అన్షును(Heroine Anshu) క్షమించమని కోరుతున్నానని అన్నారు. ఇక అక్కడ ఉన్న నవ్వించే ప్రయత్నంలో మరో తప్పు జరిగిందని, మా హీరోయిన్ ఏడిపించాలని ఆమెను ఇమిటేట్ చేశానని, దానికి కూడా ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాయో వారందరికీ మనస్పూర్తిగా క్షమాపణలు తెలియజేస్తున్నానని, పెద్ద మనసు చేసుకొని నేను చేసిన తప్పులను క్షమించాలని డైరెక్టర్ కోరారు. కాగా డైరెక్టర్ త్రినాథరావు నక్కిన ఓ ఈవెంట్ మాట్లాడుతూ.. మన్మథుడు హీరోయిన్ అన్షుపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. దీనిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Next Story