స్థానిక ఎన్నికల్లో గెలుపునకు కృషి చేయాలి.. గాంధీ భవన్‌లో మహిళా శక్తి అభియాన్​ సమావేశం

by Ramesh Naini |

స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పీసీసీ ఉపాధ్యక్షురాలు, మహిళా శక్తి అభియాన్​ ఇంఛార్జి కోట నీలిమ అన్నారు.

స్థానిక ఎన్నికల్లో గెలుపునకు కృషి చేయాలి.. గాంధీ భవన్‌లో మహిళా శక్తి అభియాన్​ సమావేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో: (Local body elections) స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పీసీసీ ఉపాధ్యక్షురాలు, మహిళా శక్తి అభియాన్​ ఇంఛార్జి కోట నీలిమ (Kota neelima) అన్నారు. (Congress) కాంగ్రెస్​ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అనేక పథకాలను అమలు చేసిందని, వాటన్నింటిని ప్రజలకు వివరించాలని కోరారు. శనివారం గాంధీ భవన్​లో మహిళా శక్తి అభియాన్​ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్​ మీటింగ్​ జరిగింది. ఈ సందర్భంగా ప్రతి జిల్లాలో, అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా రాష్ట్ర కార్యవర్గంలోని వారందరు కష్టించి పని చేయాలని, పార్టీ నాయకులను సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో పార్టీ ఉపాధ్యక్షురాలు అత్రం సుగుణ, పార్టీ ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్​, మహిళా శక్తి అభియాన్​ రాష్ట్ర నాయకులు మెర్సి ప్రియాంక, రమణిరెడ్డి, విజయలక్ష్మి, శివలాల్​, వాణిరెడ్డి, శ్రీ విద్య, సాత్విక తదితరులు పాల్గొన్నారు.

Next Story