CM Revanth Reddy: దేశంలోనే తొలిసారి.. మహిళా శక్తి బస్సులు లాంచ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి

by Prasad Jukanti |

మహిళా శక్తి బస్సులను సీఎం సీఎం రేవంత్ రెడ్డి లాంచ్ చేశారు.

CM Revanth Reddy: దేశంలోనే తొలిసారి.. మహిళా శక్తి బస్సులు లాంచ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో మహిళల సమగ్ర వికాసమే ధ్యేయంగా.. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా శక్తి పథకం కింద పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. ఈ క్రమంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం (Women's Day) సందర్భంగా దేశంలోనే తొలిసారి మహిళా సంఘాల నిధుల ద్వారా ఆర్టీసీ అద్దె బస్సులను (Mahila Shakti RTC Bus) సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఇవాళ ప్రారంభించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ సమీపంలోని పోలీస్‌ అమరవీరుల స్థూపం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తొలివిడతలో 150 ఆర్టీసీ అద్దె బస్సులకు సీఎం పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, సీఎస్ శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు.

మహిళా సంఘాల స్టాళ్ల సందర్శన

అనంతరం మహిళా దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి సభ (Indira Mahila Shakti Sabha) వేదికకు చేరుకున్న సీఎం.. అక్కడ మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన వివిధ ఉత్పత్తుల స్టాళ్లను మంత్రులు సీతక్క, పొన్నం తదితరులతో కలిసి సందర్శించారు. మహిళా పెట్రోల్ బంకుల నమూనాలు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించబోయే సోలార్ ప్లాంట్ల నమూనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ నిర్వహకులను సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోజుకు రూ.15 వేల వ్యాపారం జరుగుతోందని నిర్వాహకులు సీఎంకు వివరించారు.

Next Story