పాకిస్తాన్‌పై యుద్ధంలో దేశం సాధించింది ఏంటి?.. బీజేపీపై మహేష్ కుమార్ గౌడ్ ఫైర్

by Gantepaka Srikanth |

కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం(NDA Government), బీజేపీపై టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) సీరియస్ కామెంట్స్ చేశారు.

పాకిస్తాన్‌పై యుద్ధంలో దేశం సాధించింది ఏంటి?..  బీజేపీపై మహేష్ కుమార్ గౌడ్ ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం(NDA Government), బీజేపీపై టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) సీరియస్ కామెంట్స్ చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంటు సాక్షిగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ను అమిత్ షా అవమానించారని అన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మనుస్మృతిని అమలు చేయాలని బీజేపీ నేతల కుటిల ప్రయత్నం చేస్తున్నారని కీలక ఆరోపణలు చేశారు. రాజ్యాంగం పరిరక్షణే ధ్యేయంగా ‘జై బాపు జై భీమ్ జై సంవిధాన్’ కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. దేశ సమగ్రతకు, అఖండతకు తూట్లు పొడిచే విధంగా ప్రధాని, అమిత్ షా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అధికారమే పరమావధిగా.. అధికారం లేకుంటే బతకలేమనే విధంగా బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాజకీయ స్వలాభం కోసం బీజేపీ నేతలు కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి దేశాన్ని విచ్చినం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు.

దేశ విచ్ఛిన్న శక్తుల కుట్రలను తిప్పికొట్టేందుకు ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పిలుపు మేరకు గల్లి నుంచి ఢిల్లీ వరకు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించాం. పదేళ్లు అధికారంలో ఉండి కూడా చేసిన అభివృద్ధి చెప్పుకోలేని స్థితిలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉంది. 400 సీట్లు వస్తాయని నమ్మ బలికిన బీజేపీ నేతలకు ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పారు. అయిన వారిలో మార్పు రాలేదు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో దేశాన్ని భౌగోళికంగా, సామాజికంగా, రాజకీయంగా అర్థం చేసుకోగలిగారు. దేశంలో అసమానతలు, ఆర్థిక వ్యత్యాసం రూపుమాపేందుకు రాహుల్ గాంధీ కుల సర్వేకు శ్రీకారం చుట్టారు. రాహుల్ గాంధీ ఆశయం మేరకు సీఎం రేవంత్ రెడ్డి కుల సర్వే పూర్తి చేసి ఎవరు ఎంత నిష్పత్తిలో ఉన్నారో తేల్చి చెప్పారు. ఖర్గే, రాహుల్ గాంధీ సూచన మేరకు ఒక బీసీ, ఇద్దరు ఎస్సీ, ఒక ఎస్టీలకు కేబినెట్‌లో పదవులు కట్టబెట్టాం. పీసీసీ కార్యవర్గంలో సైతం 70 శాతం మేరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వారికి చోటు కల్పించి.. సామాజిక న్యాయానికి, మహిళలకు పెద్దపీట వేశాం. ప్రధాని పాకిస్తాన్‌పై యుద్ధం అని ప్రగల్భాలు పలికి ట్రంప్ చెప్పగానే తోక ముడిచారు. 92 వేల సైనికులను ముక్కును నేలరాపించిన చరిత్ర అపర ఖాళీ మాత ఇందిరా గాంధీది. ప్రధాని పదవిపై మోడీకి యావ తప్ప.. దేశంపై ప్రేమ లేదు. పాకిస్తాన్‌పై యుద్ధంలో దేశం సాధించింది ఏంటి? కోల్పోయింది ఏంటి? అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది.

Next Story