పోచారం వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ రియాక్ట్

by Prasad Jukanti |

మంత్రులపై పోచారం శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు.

పోచారం వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ రియాక్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: మంత్రులపై బాన్సువాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి (Pocharam Srinivas Reddy) చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) స్పందించారు. పరిస్థితులను పోచారం శ్రీనివాస్ రెడ్డి పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలన్నారు. రూ.8 లక్ష కోట్ల అప్పుతో ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ తమకు అప్పగించిందని అప్పులు, వాటి వడ్డీలకే నెలకు రూ.6,500 నుంచి రూ.7000 కోట్ల వరకు చెల్లిస్తున్నామన్నారు. ఈ విషయాన్ని పోచారం గ్రహించాలన్నారు. ఇవాళ నిజామాబాద్‍లో మీడియాతో మాట్లాడిన మహేశ్ కుమార్ గౌడ్.. పోచారం శ్రీనివాస్ రెడ్డి సీనియర్ నాయకులు, ఆయన ప్రభుత్వ సలహాదారుగా కూడా ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి నిధుల కొరత ఉంది. ఈ విషయం ఆయనకు తెలియనిది కాదన్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి అభివృద్ధిని ఆకాంక్షించే నాయకుడు అని ఈ ఇబ్బందులను ఆయన అర్థం చేసుకుంటారని అనుకుంటున్నట్లు చెప్పారు.

ఇంతకీ పోచారం ఏమన్నారు?:

సిద్దాపూర్ రిజర్వాయర్‍కు నిధుల విషయంలో ప్రభుత్వ తీరుపై పోచారం శ్రీనివాస్ రెడ్డి నిన్న అసంతృప్తి వ్యక్తం చేశారు. నిధుల మంజూరు కోసం మంత్రుల చుట్టూ తిరగాలా? మంత్రుల కాళ్లు మొక్కాలా అని హాట్ కామెంట్స్ చేశారు. నిధులు మంజూరు చేయాలని మంత్రికి ఇప్పటికే 20 సార్లు చెప్పాను అయినా చేయడం లేదు. ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యేల ఫోన్లను మంత్రులు తీయరంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోచారం చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో పోచారం వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయో వేచి చూడాలి.

Next Story