- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎమ్‌ఐఎమ్ మద్దతు మాకే.. జూబ్లీహిల్స్‌లో గెలుస్తున్నాం: మహేశ్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
by Gantepaka Srikanth |
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(Jubilee Hills By-Election)పై తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) కీలక వ్యాఖ్యలు చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(Jubilee Hills By-Election)పై తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్‌ఐఎమ్ మా ఫ్రెండ్లీ పార్టీ.. తప్పకుండా జూబ్లీ్హిల్స్‌లో వారి మద్దతు మాకే ఉంటుందని అన్నారు. ఒకటి రెండు రోజుల్లో కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటిస్తాం.. తప్పకుండా గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ గెలుపు ఏ శక్తీ కూడా ఆపలేదని జోస్యం చెప్పారు. తాము అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని అన్నారు. కాగా, కాసేపటి క్రితమే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్‌ను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. నవంబర్ 11న పోలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపింది. అనంతరం నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేయనున్నట్లు పేర్కొంది.
Next Story






