Mahesh Kumar Goud: మావోయిస్టులు ప్రజల్లోకి రావడం శుభపరిణామం

by Gantepaka Srikanth |

రాజకీయాలపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Mahesh Kumar Goud: మావోయిస్టులు ప్రజల్లోకి రావడం శుభపరిణామం
X

దిశ, వెబ్‌డెస్క్: రాజకీయాలపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాలు కలుషితం అవుతున్నాయి. కొందరు రాజకీయ నేతలు ధనార్జనపైనే దృష్టిపెడుతున్నారు. రాజకీయాల్లో ప్రక్షాళన అవసరం. ఇలాంటి పరిస్థితుల్లో మావోయిస్టులు ప్రజల్లోకి రావడం శుభపరిణామం. దేశంలో కాంగ్రెస్‌ సోషల్ సెక్యూలర్ పార్టీ. ప్రజా సేవ కోసం కాంగ్రెస్‌లో చేరాలనుకునే వారికి తప్పకుండా ఆహ్వానిస్తాం’ అని మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

కాగా, రెండ్రోజుల క్రితమే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో దాదాపు 130 మంది మావోయిస్టులు ఆయుధాలతో లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో స్టేట్ కమిటీకి చెందిన వారు ముగ్గురు, డివిజనల్ కమిటీకి చెందిన10మంది, 40మంది ఏరియా కమిటీ సభ్యులు ఉన్నారు. అలాగే 70 మంది మావోయిస్టు పార్టీ సభ్యులు ఉన్నట్లు డీజీపీ వివరించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన సూచన మేరకు మావోయిస్టులు లొంగిపోతున్నట్లు తెలిపారు.

Next Story