- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అందుకే వారికి రాహుల్ గాంధీ అధిక ప్రయారిటీ ఇస్తారు: మహేష్ కుమార్ గౌడ్
యువజన కాంగ్రెస్ పార్టీకి గుండెకాయ లాంటిదని, అందుకే రాహుల్ గాంధీ యువతకు అధిక ప్రాధన్యత ఇస్తారని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: యువజన కాంగ్రెస్ పార్టీకి గుండెకాయ లాంటిదని, అందుకే రాహుల్ గాంధీ యువతకు అధిక ప్రాధన్యత ఇస్తారని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఆయన దృష్టి నిత్యం యువజన కాంగ్రెస్‌పైనే ఉంటుందని తెలిపారు. యువజన కాంగ్రెస్ నాయకులకు మంచి భవిష్యత్తు ఉంటుందని తెలియజేశారు. యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమాలు నాంపల్లిలోని ఇందిరా భవన్ కార్యాలయంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ జెండాను టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, జూపల్లి కృష్ణరావు, మాజీ ఎంపీ హనుమంత రావు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా కాంగ్రెస్ మహిళా నాయకులు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ అధ్యక్షులు, యువజన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.






