- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM అయ్యాక రేవంత్ రెడ్డి చాలా మారాడు.. మహేశ్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు
నాలుగైదు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం ఉంటుందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: నాలుగైదు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం ఉంటుందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) అన్నారు. పీఏసీలో బీసీ రిజర్వేషన్ల అంశంపై నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. శనివారం గాంధీ భవన్లో మీడియాతో చిట్ చాట్‌లో మాట్లాడారు. ఈనెల 23 నుంచి కాంగ్రెస్ కాంగ్రెస్ పాదయాత్ర పున:ప్రారంభమవుతుందని, ఖర్గే సూచన మేరకే పాదయాత్ర చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. పాదయాత్రలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కూడా పాల్గొంటారని ఆయన తెలిపారు. ఈ పాదయాత్ర తనదని, కొందరు కావాలని మీనాక్షి పాదయాత్రగా ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మొదట బస్సు యాత్ర చేయాలని అనుకున్నామని, ఆ తర్వాత పాదయాత్రగా మార్చామన్నారు. భారత్ జోడో యాత్ర తలపించేలా పాదయాత్ర జరిగిందన్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల విషయంలో మా కమిట్మెంట్‌ను శంకిచాల్సిన అవసరం లేదనన్నారు.
గుజరాత్, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్‌లలో ముస్లింలకు ఇచ్చిన రిజర్వేషన్లపై కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదన్నారు. జంతర్ మంతర్ ధర్నాకు షెడ్యూల్ ప్రకారం రాహుల్ గాంధీ మధ్యాహ్నం 12 గంటలకు రావాల్సి ఉండగా.. రాంచీ పర్యటన లేటవ్వడంతో రాలేకపోయారని వివరణ ఇచ్చారు. బీజేపీ బీసీలకు వ్యతిరేకమని, కిషన్ రెడ్డికి బీసీల గురించి తెలియదని, బీసీల రిజర్వేషన్ అడ్డుకోవాలని కిషన్ రెడ్డి తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఈటల రాజేందర్, బండి సంజయ్ మాట్లాడాలని ఆయన కోరారు. కిషన్ రెడ్డి భయంతో బండి సంజయ్, ఈటల మాట్లాడడం లేదన్నారు. అసెంబ్లీలో బీసీ బిల్లుకు మద్దతు ఇచ్చిన బీజేపీ, కేంద్రంలో బిల్లు పాస్ చేయనివ్వడం లేదన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒప్పందంలో భాగంగానే బండి సంజయ్‌ను అధ్యక్ష్య పదవి నుంచి తొలగించారని, సికింద్రాబాద్ ఎంపీ టిక్కెట్‌ను ఒక బీసీ నుంచి, రాష్ట్ర అధ్యక్ష్య పదవిని బీసీ నుంచి కిషన్ రెడ్డి లాక్కున్నారని విమర్శించారు.
సీఎం రేవంత్ రెడ్డికి, తనకు మధ్య విభేదాలు ఉన్నట్లు కొందరు విష ప్రచారం చేస్తున్నారు. తనకు, సీఎం మధ్య మంచి రిలేషన్ ఉంది కాబట్టే.. రిజర్వేషన్ల పై ఇంత వరకు పోరాటం, పదేళ్లు నేనే సీఎం అని రేవంత్ రెడ్డి అనడంలో తప్పు లేదని, తమ ప్రభుత్వంపై కాన్ఫిడెన్స్ పెంచడం కోసం సీఎం అలా మాట్లాడడం మంచిదేనని ఆయన అన్నారు. ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి అంశంపై క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చాలా మారాడని, పీసీసీగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి వేరు.. సీఎం రేవంత్ రెడ్డి వేరని అన్నారు. పదవుల భర్తీపై కసరత్తు పూర్తయిందని, త్వరలోనే పోస్ట్‌లు భర్తీ చేస్తామని ఆయన తెలిపారు.
స్వయం ప్రతిపత్తిగల సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని మహేశ్‌కుమార్ గౌడ్ ఆరోపించారు. ఈడీ, సీబీఐ కేసులు అన్ని ప్రతిపక్షాలపైనే పెడుతున్నారని ఆయన ప్రశ్నించారు. ఒక వ్యక్తికి నాలుగు రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉందని ఆయన ఆరోపించారు. ఎస్ఐఆర్ పేరిట పెద్ద మోసం జరుగుతుందని, ప్రతిపక్ష పార్టీ ల సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని ఆయన అన్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపిక పై సర్వే జరుగుతుందని, నోటిఫికేషన్ వచ్చాకే అభ్యర్థి ఎంపిక ఉంటుందన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే పోటీ పెట్టకుండా ఉండే సాంప్రదాయాన్ని కేసీఆర్ బ్రేక్ చేశారన్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో మా గెలుపు నల్లేరు మీద నడకే మహేశ్ కుమార్ గౌడ్ధీమా వ్యక్తం చేశారు.






