- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Congress: బీఆర్ఎస్ కు నూకలు చెల్లాయి.. అందుకే కాంగ్రెస్ పై అవాకులు చెవాకులు: పీసీసీ చీఫ్
ప్రజలను బీఆర్ఎస్ అడుగడుగునా మోసం చేసింది కాబట్టే ప్రజలు ఆ పార్టీని ఇంటికి పంపించారని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రజలను బీఆర్ఎస్ అడుగడుగునా మోసం చేసింది కాబట్టే ప్రజలు ఆ పార్టీని ఇంటికి పంపించారని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (PCC Chief Mahesh Kumar Goud) విమర్శించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారని, కానీ బీసీలకు రిజర్వేషన్లు అనేది కాంగ్రెస్ పార్టీ కమిట్ మెంట్ అన్నారు. జనహిత పాదయాత్రలో (Janahita Padayatra) భాగంగా ఇవాళ పరిగిలో ఓ న్యూస్ చానల్ తో మాట్లాడిన ఆయన.. గత ప్రభుత్వంలో బీసీల రిజర్వేషన్లను 33 శాతం నుంచి 22 శాతానికి తగ్గించిన వారు ఇవాళ బీసీల రిజర్వేషన్ల కోసం ఏదో చిసినట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్ లో హామీ ఇచ్చామని ఈ ఎజెండా బిల్లుకు మారిందన్నారు. ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రం చేయని విధంగా కులగణన చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు. తాము చేస్తున్న పనులతో ప్రజల్లో తమ పని అయిపోయిందని తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు అవాకులు చెవాలుకులు పేలుతున్నారన్నారు. ఇచ్చిన హామీల అమలు విషయంలో బీఆర్ఎస్ తో చర్చకు సిద్ధం అన్నారు. ప్రజలతో మమేకం అయ్యేందుకే పాదయాత్ర చేపట్టినట్లు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. ప్రస్తుతం చేపడుతున్న పాదయాత్ర మొదటి విడత మాత్రమేననని వచ్చే మూడేళ్ల వరకు ఈ పాదయాత్ర కొనసాగుతుందని చెప్పారు. పీసీసీ చేపడుతున్న పాదయాత్రలో ఏఐసీసీ వ్యవహరాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) భాగస్వామ్యం అయ్యారని క్లారిటీ ఇచ్చారు.






