ఎవర్ని, ఎప్పుడు ఉరి తీయాలో వాళ్లకు బాగా తెలుసు: కేటీఆర్‌కు మహేశ్ గౌడ్ కౌంటర్

by Gantepaka Srikanth |

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌‌పై మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఎవర్ని, ఎప్పుడు ఉరి తీయాలో వాళ్లకు బాగా తెలుసు: కేటీఆర్‌కు మహేశ్ గౌడ్ కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌(KTR)పై మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేటీఆర్‌లో అహంకారం పరాకాష్టకు చేరిందని అన్నారు. తెలంగాణను పదేళ్లు పాలించి భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. బండారం బయటపడుతుందనే అసెంబ్లీ నుంచి పారిపోయారని విమర్శించారు. కాళేశ్వరం అంశంలో ప్రజలతో ఇప్పటికే చీకొట్టించుకున్నారు.. ఇప్పుడు పాలమూరు విషయం వచ్చేసరికి పక్కదారి పట్టించాలని చూస్తున్నారని అన్నారు. ఎవరిని, ఎప్పుడు ఉరితీయాలో తెలంగాణ ప్రజలకు తెలుసు.. ఇప్పటికే నిరూపించారు కూడా అని కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ, పార్లమెంట్, జూబ్లీహిల్స్, స్థానిక ఎన్నికల్లో బుద్ధి చెప్పినా బీఆర్ఎస్ నేతల్లో మార్పు రావడం లేదు.. ఇప్పుడు కూడా మారకపోతే ప్రజలే తరిమి కొడతారని అన్నారు.

కేసీఆర్‌ స్థాయిని తగ్గించలేరు

అంతకుముందు కేటీఆర్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో మాట్లాడే భాష సరిగా లేదు. అజ్ఞానాన్ని కప్పిపుచ్చుకునేందుకు పదే పదే బీఆర్ఎస్ నేతలను, కేసీఆర్‌ను తిడుతున్నారు. వికృతమైన మాటలతో కేసీఆర్‌ స్థాయిని తగ్గించలేరు. ముఖ్యమంత్రికి నీటిపారుదల రంగంపై కనీస అవగాహన లేదు. దోచుకోవడం, దాచుకోవడం తప్పా ఏమీ తెలియదు. తెలంగాణ కోసం రేవంత్‌రెడ్డి ప్రాణాలు ఇస్తానంటున్నారు. ఇప్పటివరకు తీసిన ప్రాణాలు చాలు అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. తాజాగా కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన మహేశ్ కుమార్ గౌడ్ పై విధంగా కౌంటర్ ఇచ్చారు.

Next Story