- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీసీలకు రిజర్వేషన్లు పోరాటం చేసి సాధిస్తాం.. మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ల విచారణపై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: (Local body elections) స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవోను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు (Supreme Court) డిస్మిస్ చేసింది. ఓ వైపు హైకోర్టులో కేసు విచారణలో ఉండగా ఇక్కడకు ఎందుకు వచ్చారని ఇవాళ సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ఈ కేసులో తెలంగాణ హైకోర్టునే ఆశ్రయించాలని పిటిషనర్ తరఫు లాయర్‌కు సుప్రీంకోర్టు సూచించింది. ఈ అంశంపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) స్పందించారు. సుప్రీం కోర్టు తీర్పు శుభ పరిణామని సోమవారం మీడియాతో మాట్లాడారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లను ఆపాలని సుప్రీంకోర్టులో వేసిన కేసును కోర్టు కొట్టి వేయడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే విషయంలో అన్ని రకాలుగా పోరాటాలు చేసి సాధిస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇప్పటికే ప్రభుత్వం 3 చట్టాలు, ఒక ఆర్డినెన్స్ ఒక జీవో ఇచ్చి.. (BC reservations) బీసీ రిజర్వేషన్లు అమలు చేసేందుకు కృషి చేసిందని వివరించారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్‌లు బీసీ రిజర్వేషన్లు అమలు కోసం నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. 8న హైకోర్టులో కూడా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తుందని ఆకాంక్షించారు. బీసీలకు రాజకీయంగా 42 శాతం రిజర్వేషన్లు అమలు అన్ని వర్గాలు ప్రభుత్వానికి సహకరించాలని సూచించారు.






