- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ నెక్ట్స్ CM బీసీనే.. కుండబద్దలు కొట్టిన పీసీసీ చీఫ్
బీసీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి తెలంగాణలో ముఖ్యమంత్రి కావడం ఖాయమని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) జోస్యం చెప్పారు.

దిశ, వెబ్‌డెస్క్: బీసీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి తెలంగాణలో ముఖ్యమంత్రి కావడం ఖాయమని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) జోస్యం చెప్పారు. శనివారం హైదరాబాద్‌లో మీడియాతో మహేశ్ కుమార్ గౌడ్ చిట్‌చాట్ నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తో తనకు విభేదాలు ఉన్నాయని కొందరు సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారని అన్నారు. అవన్నీ తప్పుడు వార్తలు అని ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు. రేవంత్ రెడ్డికి, నాకు మంచి అనుబంధం ఉందని చెప్పారు. మా ఇద్దరి మధ్య ఉన్న ఆ రిలేషన్ మూలంగానే బీసీ రిజర్వేషన్లపై ఇంత వరకు పోరాటం చేయగలిగామని అన్నారు. బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్‌ల మౌనం బీసీలకు తీరని అన్యాయం చేస్తోందని చెప్పారు. దీనిపై కిషన్ రెడ్డి సైతం ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని మరోసారి స్పష్టం చేశారు.






