బీజేపీ కుట్రను ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మనదే: TPCC చీఫ్

by Gantepaka Srikanth |   (  Updated:2025-12-27 11:45:59  IST  )

బీజేపీ కుట్రను ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మనదే: TPCC చీఫ్

బీజేపీ కుట్రను ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మనదే: TPCC చీఫ్
X

దిశ, వెబ్‌డెస్క్: జాతీయ ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తొలగించి ‘వీబీ జీరాంజీ’ పేరుతో కొత్త చట్టం తేవడాన్ని నిరసిస్తూ రేపు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోనూ కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఈ నెల 28న రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కాంగ్రెస్‌ శ్రేణులకు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌(Mahesh Kumar Goud) పిలుపునిచ్చారు. మహాత్మాగాంధీ విగ్రహాల వద్ద గాంధీ చిత్రాలను పట్టుకొని నిరసన తెలియచేయాలని సూచించారు. ఈ ఆందోళన కార్యక్రమాల్లో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కేంద్రం కుట్రలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మనమీదే ఉందని చెప్పారు. ఎన్నో ఉద్యమాల ఫలితంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఉపాధి హామీ పథకాన్ని నీరు గార్చేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఉపాధి హామీ పథకం అమలు బాధ్యతల నుంచి కేంద్రం పక్కకు జరగాలని కుట్ర చేస్తుంది.. పేదలకు, గ్రామీణ ప్రాంత కూలీలకు ఎంతో భరోసాగా ఉన్న ఈ పథకాన్ని నీరు గార్చాలని బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి, పనికి ఇచ్చే గౌరవాన్ని ప్రజలకు వివరంగా తెలియజేయాలని ఆదేశించారు.

Read More..

నాంపల్లి కోర్టుకు మంత్రి సీతక్క, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ హాజరు.. విచారణ వాయిదా

Next Story