- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేబినెట్ విస్తరణతో పీసీసీకి సంబంధం లేదు.. మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
కేబినెట్ విస్తరణతో పీసీసీకి సంబంధంలేదని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. మీడియా చిట్ చాట్ లో ఆయన మాట్లాడుతూ... ఫ్యూచర్ సిటీని హరీష్‌రావు రద్దు చేస్తామంటున్నారని, బీఆర్‌ఎస్ వచ్చేది లేదు.. రద్దు చేసేది లేదని అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: కేబినెట్ విస్తరణతో పీసీసీకి సంబంధంలేదని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. మీడియా చిట్ చాట్ లో ఆయన మాట్లాడుతూ... ఫ్యూచర్ సిటీని హరీష్‌రావు రద్దు చేస్తామంటున్నారని, బీఆర్‌ఎస్ వచ్చేది లేదు.. రద్దు చేసేది లేదని అన్నారు. ఫ్యూచర్ సిటీ రాష్ట్రానికి తలమానికం అంటూ కొనియాడారు. ట్రాఫిక్ సమస్యతో హైదరాబాద్‌లో నరకం కనిపిస్తోందని, అందుకే అన్ని హంగులతో ఫ్యూచర్ సిటీ ప్లాన్ చేశామన్నారు. తెలంగాణకు కేంద్రం మొండి చేయి చూపిస్తోందని వ్యాఖ్యానించారు.
మోడీ వచ్చి అరకొర నిధులు ఇచ్చి వెళ్లారని, కొత్త రాష్ట్రాన్ని ఆదుకోవాలనే ఆలోచన మోడీకి లేదని చెప్పారు. ఓటు హక్కు కాలరాసే ప్రయత్నం బీజేపీ చేస్తోందని ఆ ప్రయత్నాన్ని అడ్డుకుంటామన్నారు. బెంగాల్‌లో 93 లక్షల ఓట్లు తొలగించి, 31 లక్షల ఓట్లు చేర్చారని ఆరోపించారు. ప్రభుత్వం మారింది 31 లక్షల ఓట్లతోనేనని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదని, కేటీఆర్ దగ్గర ఉన్న లెక్కలు తప్పని అన్నారు. రాష్ట్రంలో పంట దిగుబడి పెరిగిందని అందుకే కొనుగోలులో కొంత ఆలస్యం అవుతోందని స్పష్టం చేశారు.






