T Congress: సీఎం రేవంత్‌రెడ్డితో మహేష్ కుమార్ గౌడ్ భేటీ.. స్టేట్ లో తాజా పరిణామాలపై కీలక చర్చ!

by Prasad Jukanti |   (  Updated:2025-09-06 07:12:15  IST  )

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పీసీసీ చీఫ్ భేటీ అయ్యారు.

T Congress: సీఎం రేవంత్‌రెడ్డితో మహేష్ కుమార్  గౌడ్ భేటీ.. స్టేట్ లో తాజా పరిణామాలపై కీలక చర్చ!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో ఇవాళ రేవంత్ రెడ్డిని (Revanth Reddy) మర్యాదపూర్వకంగా కలిశారు. టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి నేటికి ఏడాది పూర్తయిన సందర్భంగా సీఎంను మర్యాదపూర్వకంగా కలిసినట్లు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ ను సీఎం శాలువా కప్పి అభినందించారు. అనంతరం ఇద్దరు నేతలు పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలిసింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ అంశంతో పాటు రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం.

పీసీసీ కమిటీలపై ఫోకస్:

పది రోజుల్లో పీసీసీ కమిటీలు నియమించబోతున్నట్లు నిన్న మహేశ్ కుమార్ గౌడ్ మీడియాకు వెల్లడించారు. గ్రామ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ఈ విషయంలో స్పీడ్ పెంచనున్నట్లు తెలిపారు. రిజర్వేషన్ల కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ గ్యాప్ లో క్షేత్రస్థాయిలో పార్టీని మరింత పలోపేతం చేయడంపై పీసీసీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అలాగే బీసీ రిజర్వేషన్ల విషయంలో త్వరలోనే కామారెడ్డిలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని పార్టీ యోచిస్తోంది. ఈ అంశాలపై కూడా సీఎం, పీసీసీ చీఫ్ చర్చించుకున్నట్లు తెలుస్తోంది.

Next Story