- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్‌లోకి లొంగిపోయిన మావోయిస్టులు.. మహేశ్ కుమార్ గౌడ్ క్లారిటీ
లొంగిపోయిన మావోయిస్టులపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: లొంగిపోయిన మావోయిస్టులపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘నమ్ముకున్న సిద్ధాంతం కోసం మావోయిస్టులు దశాబ్దాలుగా పని చేశారు. ఆపరేషన్ కగార్‌ను మేం మొదటి నుంచి వ్యతిరేకించాం. పాకిస్తాన్‌తో చర్చలకు ఒప్పుకున్న మోడీ మావోయిస్టులతో చర్చలకు ఒప్పుకోలేదు. వాళ్ల సిద్ధాంతంతో మాకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ప్రజల కోసం పోరాడిన వాళ్లపై గౌరవం ఉంటుంది. మేమయినా, మావోయిస్టులు అయినా పేద ప్రజల కోసమే పోరాటం చేశాం. లొంగిపోయిన మావోయిస్టులు కాంగ్రెస్ పార్టీలోకి వస్తానంటే ఆహ్వానం పలుకుతాం. ప్రస్తుతానికైతే మేం ఎవరిని అడగలేదు’ అని మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.
అంతకుముందు బీఆర్ఎస్‌పై మహేశ్ కుమార్ గౌడ్ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ కోసం పని చేసిన వాళ్ళను బీఆర్ఎస్ ఏనాడూ గౌరవించలేదని అన్నారు. మార్చి నెలలో కొన్ని కార్పొరేషన్ పదవులు ఇస్తాం. కార్పొరేషన్ పదవులపై కసరత్తు జరుగుతోంది. పినరయి విజయ్ వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి సమాధానం చెప్పారు. రాజకీయాల కోసమే పినరయి విజయ్ మాట్లాడుతున్నాడు. కేరళలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అని మహేశ్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.






