Mahesh Kumar Goud: మళ్లీ రేవంత్ రెడ్డే సీఎం! మహేశ్ కుమార్ గౌడ్ సెన్సేషనల్ కామెంట్స్

by Prasad Jukanti |   (  Updated:2025-09-05 10:53:14  IST  )

ముఖ్యమంత్రి పదవిపై పీసీసీ చీప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Mahesh Kumar Goud: మళ్లీ రేవంత్ రెడ్డే సీఎం! మహేశ్ కుమార్ గౌడ్ సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి పదవిపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), నా కాంబినేషన్ సక్సెస్ ఫుల్ గా నడుస్తోందని రేవంత్ రెడ్డి నేతృత్వంలోనే రాబోయే ఎన్నికలకు వెళ్తామన్నారు. ఎమ్మెల్యేలు కోరుకుంటే రేవంత్ రెడ్డే మళ్లీ సీఎం అవుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ హైదరాబాద్ లో మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన ఆయన.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కలుపుకుని ముందుకు వెళ్తున్నామన్నారు. పార్టీ క్రమశిక్షణ విషయంలో ఎక్కడా రాజీపడటం లేదని రాజగోపాల్ రెడ్డి వ్యవహారాన్ని అధిష్టానం చూస్తోందన్నారు. రాజగోపాల్ రెడ్డితో హైకమాండ్ మాట్లాడుతోందని చెప్పారు.

10 రోజుల్లో అన్ని కమిటీలు:

రిజర్వేషన్ అంశం తేలాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని, రిజర్వేషన్లపై అసెంబ్లీ తీర్మానం ఆమోదించాలని గవర్నర్ ను కోరామన్నారు. మా విజ్ఞప్తికి గవర్నర్ సానుకూలంగా స్పందించారని చెప్పారు. త్వరలో గ్రామ, మండల, జిల్లా కమిటీలు ప్రకటించబోతున్నామని 10 రోజుల్లో అన్ని కమిటీలు పూర్తి చేస్తామన్నారు. కమిటీలు లేకపోయినా పార్టీని బలోపేతం చేశామన్న ఆయన పారదర్శకంగా డీసీసీ అధ్యక్షుల ఎంపిక ఉండబోతున్నదన్నారు. మీనాక్షి నటరాజన్ పాదయాత్ర సక్సెస్ అయిందని, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందనే నమ్మకంతో ఆశావహులు పెరిగారు. కామారెడ్డిలో బహిరంగ సభ ఏర్పాటుకు సీఎం ఆదేశాలతో సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు.

ఒక ఫ్లైట్ లో వెళ్తే ములాఖత్ అయినట్టా?:

సీఎం, హరీశ్ రావు ఒకే విమానంలో వెళ్తే కాళ్లు మక్కినట్టా? నేను, కవిత ఒకే విమానంలో చాలాసార్లు ప్రయాణించాం. అంత మాత్రాన ములాఖత్ అయినట్టా అని మహేశ్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబ సభ్యులను పార్టీలో చేర్చుకోమని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటే కక్ష పూరితం అంటారని అందువల్లే కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించామన్నారు. బీజేపీ వాళ్లు సీబీఐ ఎంక్వైరీ అడిగారు కదా, నిజాయితీగా దర్యాప్తు చేయించాలన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని మా అనుమానం అన్నారు. పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం. ఇందిరమ్మ ఇండ్లలో కార్యకర్తలు జోక్యం చేసుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.యూరియా విషయంలో కేంద్రం వైఫల్యంతోనే రైతులకు ఇబ్బంది ఏర్పడిందన్నారు.

Next Story