- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: మంత్రివర్గ విస్తరణపై పీసీసీ చీఫ్ బిగ్ అప్డేట్
తెలంగాణ పీసీసీ కార్యవర్గం, మంత్రివర్గ విస్తరణ ఈ జూన్ నెలలోనే పూర్తయ్యే అవకాశం ఉందని టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్కుమార్గౌడ్తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ పీసీసీ కార్యవర్గం, మంత్రివర్గ విస్తరణ ఈ జూన్ నెలలోనే పూర్తయ్యే అవకాశం ఉందని టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్కుమార్గౌడ్తెలిపారు. రాష్ట్రంలో మెజార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదు. వాళ్ల పనితీరును బేరీజు వేసుకోవాలన్నారు. శుక్రవారం గాంధీ భవన్‌లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షా సమావేశం మహేష్‌కుమార్‌గౌడ్ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ.. మచ్చలేని వ్యక్తి మీనాక్షి నటరాజన్ మన రాష్ట్రానికి ఇన్‌చార్జీగా రావడం శుభ సూచకం అన్నారు. నేతలంతా పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
అధికారంలో ఉన్నపుడు రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తే పార్టీ మరోసారి అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు. బూత్ స్థాయి నుంచి పార్టీ నిర్మాణం జరగాలన్నారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత మనపై ఉందని అన్నారు. ఉచిత బస్సు నుంచి సన్న బియ్యం వరకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టడం జరిగిందని చెప్పారు. కార్యకర్తలలోని నిరాశను తొలగించేందుకు సమన్వయం చేయాలని సూచించారు. ఉద్యోగాలు, వైద్యం, విద్యపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వ పనితీరుకు తగిన ప్రచారం రావడం లేదు అన్నారు.
ఈ నెలలోనే పీసీసీ కార్యవర్గం, మంత్రివర్గ విస్తరణకు అవకాశం ఉందన్నారు. కొంత మంది ఎమ్మెల్యేలు తమ పనితీరును సమీక్షించుకోవాలన్నారు. స్థానిక ఎన్నికల్లో మెరుగైన ఫలితాల కోసం ఎమ్మెల్యేలు కృషి చేయాలన్నారు. శాస్త్రీయంగా కులసర్వే చేపట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని స్పష్టం చేశారు. చిన్న చిన్న సమస్యలు ఉన్నా పరిష్కారానికి కృషి చేస్తున్నామన్ని పీసీసీ ఛీప్మహేష్కుమార్గౌడ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. విప్ అది శ్రీనివాస్, ఎమ్మెల్సీ బలమురి వెంకట్, ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ, సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






