- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Mahesh Kumar Goud: బీసీ బిల్లులపై బీజేపీ యూటర్న్.. పీసీసీ చీఫ్ ధ్వజం
బీసీ రిజర్వేషన్ల విషయంలో బీఆర్ఎస్ వెన్నుపోటు పొడిస్తే బీజేపీ యూటర్న్ తీసుకుందని పిసీసీ చీఫ్ మండిపడ్డారు.

దిశ, డైనమిక్ బ్యూరో: గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలకు ఉన్న 33 శాతం రిజర్వేషన్లను 22 శాతానికి తగ్గించి బీసీలకు వెన్నుపోటు పొడిస్తే ఇప్పుడు బీజేపీ బీసీ రిజర్వేషన్ల బిల్లులపై యూటర్న్ తీసుకుందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (PCC Chief Mahesh Kumar Goud) విమర్శించారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్ రావు వ్యాఖ్యలను బట్టి బీజేపీ బీసీ రిజర్వేషన్లకు (BC Reservations) వ్యతిరేకంగా ఉందని అర్థం అవుతున్నదన్నారు. తెలంగాణ అసెంబ్లీలో మద్దతు తెలిపిన బీజేపీ జాతీయ స్థాయిలో మరో మాట మాట్లాడుతున్నదని ధ్వజత్తారు. ఇవాళ ఏఐసీసీ పెద్దలతో సమావేశమైన అనంతరం ఢిల్లీలో (Delhi) మీడియాతో మాట్లాడిన మహేశ్ కుమార్ గౌడ్.. తెలంగాణలో కులగణన తీరుతెన్నులు, బీసీ రిజర్వేషన్ల బిల్లుల విషయాలను పార్టీ పెద్దలకు వివరించామన్నారు. రాహుల్ గాంధీ స్పూర్తితోనే తెలంగాణలో కులగణన చేశామని బీసీలకు న్యాయం చేయడమే కాంగ్రెస్ లక్ష్యం అన్నారు. కులగణన, బీసీ రిజర్వేషన్ల అంశంపై ఇవాళ సాయంత్రం ఇండియా కూటమి ఎంపీలకు పీపీటీ ఇవ్వబోతున్నామని చెప్పారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం చేయాల్సిందంతా చేసిందని రెండు బిల్లు తీసుకువచ్చామని అవి కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్నాయన్నారు. తెలంగాణ పంపిన బీసీ బిల్లులు కేంద్రం ఆమోదం తెలుపకుంటే రాహుల్ గాంధీ నేతృత్వంలో దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తామన్నారు.






