- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశం అటకెక్కలేదు: మహేశ్ కుమార్ గౌడ్
బీసీలకు రిజర్వేషన్ల విషయంలో తమ ప్రభుత్వం చేయని ప్రయత్నం అంటూ లేదని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో చేయని ప్రయత్న అంటూ లేదని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (PCC Chief Mahesh Kumar Goud) అన్నారు. బీసీ రిజర్వేషన్ల (BC Reservations) విషయంలో చిత్తశుద్ధితో ఉన్నామని అయితే హైకోర్టు ఆదేశాల మేరకే రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ జరుగుతోందన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం రెండు బిల్లులు ఆమోదిస్తే వాటిని గవర్నర్ ఆమోదించలేదని దాంతో ఆర్డినెన్స్ తెస్తే దాన్ని కూడా గవర్నర్ పెండింగ్ లో ఉంచారని చెప్పారు. రిజర్వేషన్ల విషయంలో మా ప్రయత్నానికి కేంద్రంంలోని బీజేపీ ప్రభుత్వం మోకాలడ్డుతోందని విమర్శించారు. ఇవాళ ఓ న్యూస్ చానల్ తో మాట్లాడిన ఆయన.. 42 శాతం రిజర్వేషన్లు అటకెక్కినట్లు బీసీ సంఘాలు భావిస్తున్నాయి. కానీ అలాంటి అపోహలకు అవకాశం లేదన్నారు. 90 శాతం సర్పంచ్ లు కాంగ్రెస్ కు చెందిన వ్యక్తులే ఎన్నిక అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకే కులగణన చేశామన్నారు. దీని ద్వారా బీసీ జనాభా 56.7 శాతం అని తేల్చామన్నారు.






