- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్థానిక ఎన్నికల్లో యువత ఉత్సాహం
దిశ, అడ్డాకుల : తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42 శాతం స్థానిక ఎలక్షన్లో రిజర్వేషన్ కల్పిస్తాదన్న నిర్ణయంతో యువతల్లో ఉత్సాహం పెరిగి సన్నగిల్లింది. అధికారులు రిజర్వేషన్లు కేటాయించక

దిశ, అడ్డాకుల : తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42 శాతం స్థానిక ఎలక్షన్లో రిజర్వేషన్ కల్పిస్తాదన్న నిర్ణయంతో యువతల్లో ఉత్సాహం పెరిగి సన్నగిల్లింది. అధికారులు రిజర్వేషన్లు కేటాయించక ముందే సోషల్ మీడియాలో రిజర్వేషన్లు పెట్టడంతో అడ్డాకుల మండల కేంద్రంలో గతం కంటే జనరల్ రిజర్వేషన్లు ఎక్కువ కావడంతో బీసీ రిజర్వేషన్లు తగ్గడంతో బీసీ సంఘ నాయకులు మండిపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% కేటాయిస్తామని మాట ఇవ్వడంతో అప్పుడు జనరల్ రిజర్వేషన్లు మండల కేంద్రంలో 17 కు గాను ఐదు జనరల్ గా, బీసీలకు 8 రిజర్వేషన్లు కేటాయించారు. ఎస్టీకి ఒకటి, ఎస్సీకి మూడు రిజర్వేషన్లు కేటాయించారు. ఇప్పుడు కేటాయించిన రిజర్వేషన్లు బీసీలకు అన్యాయం జరుగుతుందని బీసీ నాయకులు మండిపడుతున్నారు.
స్థానిక ఎలక్షన్లో ఎప్పుడు కూడా 60 ఏళ్లు పైబడే మాజీల వైపే ప్రజలు ముగ్గు చూపిస్తున్నారు. అందుకు ప్రధాన కారణం ఒకసారి స్థానిక ఎలక్షన్లో పోటీ చేస్తే వారిని ఎల్లకాలం గుర్తించుకునే ప్రజలు మళ్ళీ వాళ్లే నిలబడతారని ఊహల్లో ఉంటారని విశ్లేషకులు చెప్తున్న మాట. కాలానుగుణంగా ఇప్పుడున్న ఏఐ టెక్నాలజీ మరియు సోషల్ మీడియా తో పోలిస్తే జనంలో మనం ఎంత వెనుకబడి ఉన్నామో అని యువతల్లో ఉత్సాహం పెరిగింది. మన గ్రామాలలో అన్నీ ఉన్న ఎందుకు అభివృద్ధిలో వెనుకబడి పోతుందో అన్న సందేహం మెదల్లో మొదలవుతుంది.
ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత.. తగ్గెదేలే..!
మనం ఎందుకు పోటీ చేయవద్దు ఎలక్షన్లో అన్న సందేహం ప్రతి యువతలో కలుగుతుంది. స్థానిక ఎలక్షన్లో ఇప్పటికీ కూడా కొన్ని గ్రామాలలో 'రంగస్థలం' తలపిస్తుంది. ఎప్పటికీ కూడా స్థానిక ఎలక్షన్లో అతగాడికి తిరుగులేదని ఊహల్లో ఉంటారు. నిలబడే అవకాశాలు ఉన్న కూడా నిరాశతో ఓటుకు దూరంగా పల్లెల్లో నిరాశతో ఉన్నవారికి ప్రభుత్వం ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేయడం నిర్ణయంతో కొత్తగా యువత పోటీల్లో తగ్గేదేలే...! అంటున్నారు. నాయకులు, కార్యకర్తలు పార్టీ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనాలన్న స్థానికంగా పోటీ చేయాలన్న ఇద్దరు పిల్లలు నిబంధన ఉండడం వల్ల ఓటు బ్యాంకు ఉన్న కూడా రాజకీయంగా అనార్హులుగా దూరంగా ఉండేవారు. ఇప్పుడు నిబంధన ఎత్తివేయడంతో వారు ఉత్సాహంతో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.
జనరల్ రిజర్వేషన్ లో పోటీ ఎక్కువే..!
సాధారణంగా జనరల్ రిజర్వేషన్ వచ్చిందంటే ఆ గ్రామాలలో అన్ని పార్టీలు ఏకమై సిండికేట్ గా ఏర్పడి పార్టీల్లో ఉన్న ఒకే వ్యక్తిని నియమించి క్యాండిడేట్ ని నియమించి గెలిపించుకుంటారని విశ్లేషకుల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఇది ట్రెండ్ గా మారింది. జనరల్ రిజర్వేషన్ అయితే కుల, మతానికి ఒకరు నిలబడడానికి ముందుకొస్తున్నట్లు సోషల్ మీడియాలో ఇప్పటికే పోస్టులు పెడుతున్న వారు రోజు రోజుకు పెరుగుతున్నారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి నాకు అవకాశం కల్పించండి అని ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా తెలపడమే కాకుండా కొందరు దావత్ లు సైతం ఇస్తున్నట్లు సమాచారం. మరికొందరు నాయకులు ప్రభుత్వ పథకాల గురించి తెలుపుతూ ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలను పరిష్కరించడం చేస్తున్నారు.
తప్పని రెబల్స్ బెడద
మండలంలో కాంగ్రెస్,బీఆర్ఎస్ పార్టీలలో అంతర్గత విభేదాలతో సర్పంచ్ ఎన్నికలు సందడి నెలకొంది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే అభ్యర్థులను ఖరారు చేయాల్సిన అభ్యర్థులనే నిలబెట్టాలని మండల కేంద్రంలో వివిధ పార్టీ నాయకులు చర్చిస్తున్నారు. పార్టీలలో మొదటి నుంచి పార్టీకి కష్టపడిన కార్యకర్తలను దూరంగా ఉంచడంతో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ మూల్యం చెల్లించుకున్నది. వివిధ పార్టీలో ఓటు బ్యాంకు లేని కొత్తగా వచ్చిన వ్యక్తులకు అధికారం ఇవ్వడంతో చాలామంది కార్యకర్తలు పార్టీలకు దూరంగా ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు తమ సత్తా చూపిస్తామని ఇన్నాళ్లు మౌనంగా ఉన్న రెబల్స్ తగ్గేదేలే అంటూ నాయకులకు సవాల్ విసురుతున్నారు. ఏది ఏమైనా అటు బీసీలు, ఇటు యువత, రెబల్స్ తో పార్టీ నాయకులు తల పట్టుకోవాల్సి ఉంది. ఏది ఏమైనా ఈ స్థానిక ఎలక్షన్లో తగ్గేదేలే...! అంటున్న కొత్త వారు పోటీల్లో సందడి చేసే అవకాశం ఉంటుంది.
గతంలో అడ్డాకుల సర్పంచ్ అభ్యర్థుల రిజర్వేషన్ వివరాలు :
1.అడ్డాకుల -OC
2.కాటవరం -BC జనరల్
3.Rc పూర్ -BC మహిళ
4.తిమ్మాయిపల్లి -Bc మహిళ
5.TP తాండా -ST
6.గుడిబండ -OC మహిళ
7.శాఖాపూర్-OC మహిళ
8 సుంకిరామాయ్య పల్లి- OC
9.కందూర్ -BC మహిళ
10.పొన్నకల్ -BC
11.రాచాలా -SC
12.CM చేడ్ -BC
13.PM చేడ్ -SC
14.బలీద్ పల్లి -OC
15.కన్మనూరు -Sc మహిళ.
16.వర్నె -BC మహిళ
17.ముత్యాలం పల్లి -బీసీ
ప్రస్తుతం అడ్డాకుల సర్పంచ్ అభ్యర్థుల రిజర్వేషన్లు
1.అడ్డాకుల -OC
2.కాటవరం -BC జనరల్
3.Rc పూర్ -BC మహిళ
4.తిమ్మాయిపల్లి - OC మహిళ
5.TP తాండా -ST
6.గుడిబండ -OC మహిళ
7.శాఖాపూర్-OC మహిళ
8 సుంకిరామాయ్య పల్లి- BC జనరల్
9.కందూర్ -BC మహిళ
10.పొన్నకల్ -BC
11.రాచాలా -SC
12.CM చేడ్ -OC
13.PM చేడ్ - Sc మహిళ
14.బలీద్ పల్లి -OC మహిళ
15.కన్మనూరు -Sc మహిళ.
16.వర్నె -OC మహిళ
17.ముత్యాలం పల్లి -BC






