- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజా ప్రభుత్వంపై మీ ప్రేమ.. అభిమానం ఉండాలి
ప్రజా ప్రభుత్వంపై.. మీ ప్రేమ.. ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఉండాలి అని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి అన్నారు. మంగళవారం భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్ లో నాబార్డ్ వారి సహకారంతో మైక్రో ఎంటర్ ప్రైజెస్ డెవలప్ మెంట్ ప్రోగ్రాం లో భాగంగా మహిళా సంఘాలకు విద్యార్థుల యూని ఫామ్ శిక్షణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.

ప్రజా ప్రభుత్వంపై మీ ప్రేమ.. అభిమానం ఉండాలి
- ప్రభుత్వ పథకాలు సద్వినియోగపరచుకొని మహిళలు కోటీశ్వరులు కావాలి
-స్కూల్ యూని ఫామ్స్ కుట్టు శిక్షణ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే జీఎంఆర్
దిశ, భూత్పూర్ : ఈ ప్రజా ప్రభుత్వంపై.. మీ ప్రేమ.. ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఉండాలి అని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి అన్నారు. మంగళవారం భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్ లో నాబార్డ్ వారి సహకారంతో మైక్రో ఎంటర్ ప్రైజెస్ డెవలప్ మెంట్ ప్రోగ్రాం లో భాగంగా మహిళా సంఘాలకు విద్యార్థుల యూని ఫామ్ శిక్షణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రజా ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టింది అన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బస్సులలో ఉచిత ప్రయాణం, మహిళా సంఘాలకు రుణాలు, ప్రమాదవశాత్తు మృతి చెందితే 10 లక్షల ఇన్సూరెన్స్, కార్పొరేట్ సంస్థలకు దీటుగా మహిళా సంఘాలు వివిధ ఉత్పత్తులు చేసి మార్కెట్ చేసే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది అన్నారు. మహిళా సంఘాలు బస్సు ఓనర్లుగా, పెట్రోల్ బంక్ నిర్వాహకులుగా బాధ్యతలు నిర్వహిస్తూ ఆర్థికంగా నిలదుక్కుకుంటున్నారు అన్నారు. మహిళలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారు. సన్న బియ్యం, ఉచిత విద్యుత్తు సరఫరా, రూ.500లకే సిలిండర్ వంటి పథకాలు కూడా ఎంతగానో తోడ్పడుతాయని అన్నారు. మన రాష్ట్ర మహిళా సంఘాలు సాధిస్తున్న విజయాలు వివిధ రాష్ట్రాల మహిళలకు మార్గదర్శకం కావాలని విజ్ఞప్తి చేశారు. ఇంతగా చేస్తున్న ఈ ప్రజా ప్రభుత్వం పై మీ అభిమానం.. ప్రేమ ఎప్పటికీ ఉండాలి అని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. అనంతరం ఎమ్మెల్యే 26 మహిళా సంఘాలకు మూడు కోట్ల 25 లక్షల రూపాయల చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కదిరే శేఖర్ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి,మున్సిపాలిటీ అధ్యక్షుడు నవీన్ గౌడ్, మండల మహిళా సంఘం అధ్యక్షురాలు పద్మ, నాయకులు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.






