మ‌ధ్యాహ్న భోజ‌నంలో పురుగులు

by Ratna Kumari |

దిశ‌, మ‌క్త‌ల్ : ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో మ‌ధ్యాహ్న భోజ‌నాన్ని ముందుగా ఉపాధ్యాయులు భోజ‌నం చేసిన త‌రువాత విద్యార్థుల‌కు వ‌డ్డించాల‌నే నిబంధ‌న‌లున్నాయి. కానీ ఆ నిబంధ‌న‌లు

మ‌ధ్యాహ్న భోజ‌నంలో పురుగులు
X

దిశ‌, మ‌క్త‌ల్ : ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో మ‌ధ్యాహ్న భోజ‌నాన్ని ముందుగా ఉపాధ్యాయులు భోజ‌నం చేసిన త‌రువాత విద్యార్థుల‌కు వ‌డ్డించాల‌నే నిబంధ‌న‌లున్నాయి. కానీ ఆ నిబంధ‌న‌లు ఉపాధ్యాయులు ఉల్లంఘిస్తున్నారు. ముఖ్యంగా ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ఏజెన్సీ వాళ్లు వండిన‌టువంటి అన్నం వృధాగా ప‌డేస్తున్నారు. దీంతో అటు విద్యార్థుల క‌డుపు నిండ‌క‌పోయిన‌ప్ప‌టికీ.. ప్ర‌భుత్వ ఖ‌జానాను ఖాళీ చేస్తున్నారు. తాజాగా మ‌క్త‌ల్ ప‌ట్ట‌ణంలోని ప్ర‌భుత్వ ఉన్న‌త పాఠ‌శాల‌లో ఇవాళ మ‌ధ్యాహ్నం వ‌డ్డించిన అన్నంలో నీళ్ల చారులో పురుగులు స్ప‌ష్టంగా విద్యార్థుల‌కు క‌నిపించాయి. దీంతో ప‌క్క‌నే ఉన్న‌టువంటి చెత్త కుండీలో ప‌డేశారు. ఈ విష‌యాన్ని ఎంఈవో అనిల్ గౌడ్ దృష్టికి తీసుకెళ్ల‌గా వెంట‌నే పాఠ‌శాల వ‌ద్ద‌కు వ‌చ్చి పురుగులు ప‌డిన అన్నాన్ని ప‌రిశీలించారు. అనంత‌రం వంట కాంట్రాక్ట‌ర్ ని తొల‌గిస్తామ‌ని చెప్పారు. గురువారం నుంచి కొత్త కాంట్రాక్ట‌ర్ తో మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కాన్ని చూసుకుంటార‌ని అందుకు పాఠ‌శాల హెడ్ మాస్ట‌ర్ ను ఆదేశించారు.

ప్ర‌తీ విద్యార్థికి నాణ్యమైన ఒంటి పూట భోజనం అందించాలని సూచించారు. ఆయా రోజుల్లో అందించాల్సిన గుడ్లు, మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కం ఏజెన్సీలు అందించ‌డం లేద‌ని వారిపై మండిప‌డ్డారు ఎంఈఓ. మ‌రోవైపు మ‌ధ్యాహ్న భోజ‌నం ప‌ర్య‌వేక్షించే టీచ‌ర్ విద్యార్థుల క‌డుపులో కొడుతున్నార‌ని ఏబీవీపీ విద్యార్థి నాయ‌కులు పేర్కొన్నారు. నియోజ‌క‌వ‌ర్గంలోనే ఇలాంటి ప‌రిస్థితి ఉంటే.. మారుమూల గ్రామాల్లో ఏవిధంగా ఉంటుందో ఇట్టే అర్దం చేసుకోవ‌చ్చ‌ని విద్యార్థి సంఘాల నాయ‌కులు పేర్కొంటున్నారు. మండ‌లంలో ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఎంఈవో అనిల్ గౌడ్ తెలిపారు.

Next Story