- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చేపల పెంపకం ద్వారా మత్య్సకారుల అభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
దిశ, మిడ్జిల్ : చేపల పెంపకం ద్వారా మత్స్యకారుల కుటుంబాల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. శనివారం

దిశ, మిడ్జిల్ : చేపల పెంపకం ద్వారా మత్స్యకారుల కుటుంబాల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. శనివారం మిడ్జిల్ మండల కేంద్రంలో నల్ల చెరువులో నాయకులతో కలిసి చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చేపలు వ్యాపారం ద్వారా మత్స్యకారులు వ్యాపారులుగా ఎదగాలని తెలిపారు. మొబైల్ వాహనాలు ద్వారా చేపల విక్రయానికి వాహనాలు మంజూరు చేసామని తెలిపారు. మత్స్య సంపద అభివృద్ధికి రాష్ట్రప్రభుత్వం 123 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 50 శాతం మాత్రమే చిన్న చేప పిల్లలలో పంపిణీ చేసిందని , ప్రజాపాలనలో 100% నాణ్యమైన చేప పిల్లలను పంపిణీ చేశామన్నారు. మత్సకారుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని సూచించారు. ముదిరాజుల అభివృద్ధికి ప్రజాపాలనలో ప్రత్యేక కార్యచరణ ద్వారా ఆర్థిక అభివృద్ధి చెందేలా సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. అభివృద్ధి రాజకీయాల కతీతంగా నాయకులు, ప్రజల సహాయ సహకారాలు అందించాలని ఆయన సూచించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే వర్షాలు సమృద్ధిగా కురిసి చెరువులు అలుగుపడుతున్నాయని ఎమ్మెల్యే అన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో చెరువులు నిండాయని, ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో వర్షాలు సమృద్ధిగా కురవడంతో జడ్చర్ల నియోజకవర్గం లోని 389 చెరువులు పూర్తిస్థాయిలో నుండి అలుగు పారుతున్నాయని గుర్తు చేశారు. మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. 2023 నుండి 25 వరకు 70 లక్షల చేప పిల్లలను నియోజకవర్గం మొత్తం పంపిణీ చేసినట్లు తెలిపారు . ప్రస్తుతం 49.53 లక్షల చేప పిల్లలను అందజేస్తున్నట్లు అన్నారు. చెరువుల అభివృద్ధికి , మరమ్మత్తులకు ప్రతిపాదనలు పంపాలని సూచించారు. జడ్చర్లలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పండుగ సాయన్న విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ముదిరాజులకు హామీ ఇచ్చారు. మిడ్జిల్ మండల కేంద్రంలో అసంపూర్తిగా ఉన్న ముదిరాజ్ భవనానికి నిధులు మంజూరు కావాలని ఎమ్మెల్యేను కోరారు . ఎస్ డి ఎఫ్ నిధుల నుండి భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్చర్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ జ్యోతి అన్వాల్ రెడ్డి, నాయకులు మాజీ జడ్పీటీసీ రబ్బానీ, బాల్ రెడ్డి, బరిగెల వెంకటయ్య, మాజీ ఎంపీపీ గౌస్, సాయిలు, సంపత్ కుమార్, నరేందర్ రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, శంకర్, అశోక్ , నరసింహ,విజయ్ కుమార్, జహంగీర్, రాము గౌడ్, శివ ప్రసాద్, పర్వతాలు, ఉస్మాన్ ,జహీర్ ,యాదయ్య , భాస్కర్ పాల్గొన్నారు.






