- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరింత నిబద్దతతో పని చేయాలి : ఎస్పీ జానకి
నేరాల నియంత్రణకై మరింత నిబద్దతతో పని చేయాలని ఎస్పీ జానకి సూచించారు. గురువారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎస్పీ జానకి ఆధ్వర్యంలో నిర్వహించిన నేర సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు.

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : నేరాల నియంత్రణకై మరింత నిబద్దతతో పని చేయాలని ఎస్పీ జానకి సూచించారు. గురువారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎస్పీ జానకి ఆధ్వర్యంలో నిర్వహించిన నేర సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతి కేసులో క్యాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉండేలా దర్యాప్తు చేపట్టి నేరస్తులకు శిక్షపడే విధంగా చట్టపరంగా బలమైన ఆధారాలను సమర్పించాలని ఆదేశించారు. కేసుల విచారణలో జాప్యం, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలు, ఆర్థిక నేరాలు, ఆన్లైన్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో తరచూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి సారించి, ఆధునిక సాంకేతికతను వినియోగించి నేరాలను చేధించాలని ఆమె సూచించారు. ప్రతి పోలీస్ స్టేషన్ లో విలేజ్ హిస్టరీ షీట్స్ ను అప్డేట్ చేయాలని, గ్రామాల వారీగా నేర చరిత్ర పై పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఆదేశించారు.
విలేజ్ పోలీస్ అధికారులు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలతో మమేకమైన సామాజిక అంశాలపై అవగాహన కల్పించాలని, ఎస్ హెచ్ఓ లు తమ పరిధిలోని ప్రతి గ్రామాన్ని సందర్శించి స్థానిక సమస్యలను తెలుసుకొని ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు. నైట్ బీట్, పెట్రోలింగ్ విధులను మరింత సమగ్రంగా నిర్వహించాలని, సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేసేలా పర్యవేక్షించాలని, దొంగతనాల కేసుల్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి లాంగ్ పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి, దొంగిలించిన సొత్తును బాధితులకు తిరిగి అందించాలన్నారు. చట్ట ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకుంటూ ఎన్ ఫోర్స్ మెంట్ కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాలని, శాంతిభద్రతల పరిరక్షణలో ఎలాంటి అలసత్వం ఉండకూడదని ఆమె స్పష్టం చేశారు. అంతేకాకుండా సిబ్బంది సమస్యలను సమయానికి పరిష్కరించేందుకు ఎస్ఐ లు సరైన విధంగా ఎండార్స్ చేసి ఉన్నతాధికారులకు పంపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎన్బీ రత్నం, డీఎస్పీ లు వెంకటేశ్వర్లు, రమణారెడ్డి, సీఐలు అప్పయ్య, ఐజాజోద్ధిన్, కమలాకర్, రామకృష్ణ, ఆర్ఐ లు కృష్ణయ్య, నగేష్, అశోక్ కుమార్, అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్హెచ్ఓ లు పాల్గొన్నారు.






